మహేష్ - మురగదాస్ కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మురుగదాస్ తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా మొదటిసారి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నఈ చిత్రానికి ఇప్పటివరకు టైటిల్ ఖరారు చెయ్యలేదు. అయితే ఈ చిత్రానికి ఇప్పటివరకు 'ఏజెంట్ శివ' అనే టైటిల్ నానుడిలో వుంది. దాదాపు ఇదే టైటిల్ ని ఈ సినిమాకి పెడతారని వార్తలొచ్చాయి. ఎందుకంటే ఈ చిత్రంలో మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించనున్నాడని అందుకే ఇదే టైటిల్ అయితే బావుంటుందని చిత్ర యూనిట్ అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది.
అయితే 'ఏజెంట్ శివ' టైటిల్ దాదాపు ఖరారైపోతుందనుకున్న టైమ్ లో ఇప్పుడు మహేష్, మురుగదాస్ చిత్రానికి 'సంభవామి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఈ టైటిల్ ని డైరెక్టర్ మురుగదాస్ రివీల్ చేసినట్లు చెబుతున్నారు. మహేష్ కి ఈ టైటిల్ అయితే బావుంటుందని భావించిన మురుగదాస్ ఈ టైటిల్ పెట్టినట్లు చెబుతున్నారు. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని జనవరి 1 న, టీజర్ ని జనవరి 26 రిపబ్లిక్ డేకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.