Advertisement
Google Ads BL

ప్రగ్యా..లక్‌ మారిపోవడం ఖాయం..!


ఏ హీరోయిన్‌ అయినా దర్శకేంద్రుని చిత్రంలో చిన్న పాత్రకు ఎంపికైనా సరే ఇండస్ట్రీలోని అందరి దృష్టి ఆ భామపై పడుతుంది. దాంతో వారిని తమ తమ చిత్రాలలో బుక్‌ చేసుకోవాలని ఇతర దర్శకులు ఆరాపడుతూ, ఆ చిత్రం విడుదల కాకపోయినా ముందుగానే తమ తమ చిత్రాలలో వారికి అవకాశం ఇస్తుంటారు.దీనికి ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. ఐరన్‌లెగ్‌లుగా ముద్రపడిన రమ్యకృష్ణ వంటి ఎందరి జాతకాలనో రాఘవేంద్రుడు ఒక్కసారిగా మార్చేసిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇక 'కంచె' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు ఎంటరైన భామ ప్రగ్యాజైస్వాల్‌. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న ఈ భామను మన దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ దర్శకేంద్రుడు తన తాజా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో ఓ ముఖ్యపాత్ర కోసం ఆమెను ఎంచుకున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని ప్రగ్యాజైస్వాల్‌ స్టిల్స్‌ అందరినీ కట్టిపడేస్తున్నాయి. కాగా తాజాగా 'సరైనోడు' వంటి పవర్‌ఫుల్‌ చిత్రాన్ని తీసి బ్లాక్‌బస్టర్‌ కొట్టిన దర్శకుడు బోయపాటి శ్రీను ఆ చిత్రంలో ఐరన్‌లెగ్‌ సుందరి కేథరిన్‌కు ఎమ్మెల్యే పాత్రను ఇచ్చి ఆమె కెరీర్‌ను మరలా గాడిలో పడవేశాడు. తాజాగా ఆయన నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ పవర్‌ఫుల్‌ చిత్రం చేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. సాయిశ్రీనివాస్‌ నటించిన 'అల్లుడుశీను,స్పీడున్నోడు' చిత్రాలు కమర్షియల్‌గా భారీ నస్టాలనే చవిచూశాయి. కాగా వినాయక్‌ చేయలేని మ్యాజిక్‌ను బోయపాటి చేస్తాడని సాయి శ్రీనివాస్‌ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్రంలో టాప్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ పాత్ర కూడా ఉందిట. దాని కోసం ఎవరిని ఎంపిక చేయాలా? అని ఆలోచిస్తున్న బోయపాటికి రాఘవేంద్రుని భామపై గురి కుదిరినట్టుగా ఉంది. దీంతో బోయపాటి ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా ప్రగ్యాజైస్వాల్‌ను తీసుకున్నాడని సమాచారం. మంచి గ్లామరస్‌గా కనిపిస్తూనే ఈ చిత్రంలోని ప్రగ్యా పాత్ర ఎంతో కీలకంగా కూడా ఉంటుందని సమాచారం. మరి 'నమో వేంకటేశాయ'చిత్రంతో పాటు బోయపాటి పుణ్యాన ప్రగ్యా స్టార్‌హీరోల దృష్టిని ఆకర్షించడం ఖాయమంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

Advertisement
CJ Advs

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs