Advertisement
Google Ads BL

రెచ్చిపోతున్న శ్రీని, తేజస్వి..!


నటునిగా, దర్శకునిగా విభిన్నతరహా చిత్రాలను చేస్తూ, తనలోని క్రియేటర్‌ను బయటకు తీసుకొస్తు, ఇప్పటికే ప్రేక్షకుల్లో ఓ మంచి గుర్తింపును తెచ్చుకున్న, తెచ్చుకుంటున్న వ్యక్తి శ్రీని అవసరాల. కాగా ఆయన ప్రస్తుతం బాలీవుడ్‌ అడల్డ్‌ కామెడీ విత్‌ అండర్‌కరెంట్‌ మెసేజ్‌ చిత్రం 'హంటర్‌' తెలుగు రీమేక్‌లో సెక్స్‌ అడిక్ట్‌ అయిన ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. నవీన్‌ మేడారం దర్శకునిగా పరిచయం అవుతున్న ఈచిత్రానికి 'సోగ్గాడు' అనే టైటిల్‌ను కూడా కన్‌ఫర్మ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనికి 'బాబుగారు బిజీ' అనేది క్యాప్షన్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రీలుక్‌ సినిమాకు తగ్గట్టుగానే కేవలం కవ్వించే ఓ పెదాలను చూపిస్తూ విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. ప్రస్తుతం దాదాపుగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాలీవుడ్‌ రేంజ్‌లో కాకపోయినా తెలుగులో కూడా పలు హాట్‌ సీన్స్‌తో రూపొందుతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో మిష్టీ చక్రవర్తి, తేజస్వి, సుప్రియ, శ్రీముఖిలు కథానుసారం శ్రీని అవసరాలతో హాట్‌ హాట్‌ సీన్స్‌లో కనిపించి, యువత మతులను పోగొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీని, తేజస్విల మద్య ఓ లిప్‌లాక్‌ సీన్‌ ఉందట. మొదట ఈ సన్నివేశంలో నటించడానికి 'ఐస్‌క్రీం' పాప తేజస్వి కాస్త అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఈ సీన్‌ సినిమాకు కీలకం కావడంతో దర్శక, హీరోల సూచనల మేరకు అంగీకారం తెలిపిందని సమాచారం. కాగా ఈ హాట్‌ లిప్‌లాక్‌ సీన్‌లో తేజస్వి, శ్రీని అవసరాల జీవించేశారని, ఈ సీన్‌ చిత్రానికి ఓ పెద్ద హైలైట్‌గా నిలుస్తుందని యూనిట్‌సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎంతటి సంచలనాలను సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs