Advertisement
Google Ads BL

'మగధీర' రూమర్లపై స్పందించిన నిర్మాత!


'మగధీర' చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత ఆ చిత్ర విజయం తన కుమారుడు రామ్‌చరణ్‌కే దక్కుతుందని చిరంజీవి వ్యాఖ్యానించాడని, దీనిపై దర్శకుడు రాజమౌళి బాగా హర్ట్‌ అవ్వడంతో వారి మధ్య విబేదాలు వచ్చాయనే టాక్‌ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. దాంతో జక్కన్న తాను స్టార్‌ ఇమేజ్‌ లేని వారితో కూడా సూపర్‌హిట్లు కొట్టగలనని సునీల్‌తో 'మర్యాదరామన్న', గ్రాఫిక్స్‌ మాయాజాలంతోనే 'ఈగ' చిత్రాలను తీసి, సంచలనం సృష్టించి, చిరుకు సరైన సమాధానం ఇచ్చాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ నిర్మాత దిల్‌రాజు వీటిని కొట్టిపారేశాడు. ఇవ్వన్నీ కేవలం పుకార్లేనని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం సక్సెస్‌ క్రెడిట్‌ తాను దర్శకహీరోలిద్దరికీ సమానంగా ఇస్తానని అన్నాడు. క్రియేటర్‌గా రూపకల్పన చేసేది డైరెక్టరే అయినా దాన్ని దర్శకుడి ఆలోచనలకు తెరపై రూపం ఇచ్చేది మాత్రం హీరోనే అని, ఓ చిత్రం విషయంలో ఇద్దరు తమ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించినప్పుడే ఆ చిత్రం విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చాడు. 'బంగారుకోడిపెట్ట....' సాంగ్‌కు అప్పట్లో చిరు అద్బుతమైన పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. అదే స్థాయిలో 'మగధీర'లో పాటకు చరణ్‌ కూడా ప్రాణం పోయగలిగాడు కాబట్టే ఆ పాట కూడా సూపర్‌హిట్‌ అయిందంటూ దానికి ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. కాగా 'మగధీర' విషయంపై దిల్‌రాజు ఈ క్లారిటీని ఏ హోదాలో ఇచ్చాడనే విషయంపై మాత్రం ప్రస్తుతం ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. మొత్తానికి కర్ర విరగకుండా.. పాము చావకుండా తెలివిగా ఇద్దరినీ తన మాటలతో దిల్‌రాజు శాటిస్‌ఫై చేసాడని స్పష్టమవుతోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs