Advertisement
Google Ads BL

'బాహుబలి' ని వదిలేసినా.. హాట్‌ టాపిక్కే..!


'బాహుబలి' చిత్రం సాధించిన విజయాన్ని మాటల్లో చెప్పడం వీలుకాదు. అన్ని భాషల్లో ఓ ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రంలోని కొన్ని పాత్రల్లో నటించడానికి కొంతమంది మొదట్లో నిరాకరించారు. వారు కూడా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారుతున్నారు. కాగా ఈచిత్రంలో శివగామిగా నటించిన రమ్యకృష్ణకు ఈ చిత్రం ఎంతటి క్రేజ్‌ను తీసుకొచ్చిందో తెలిసిందే. మొదట ఈ పాత్ర కోసం రాజమౌళి శ్రీదేవిని సంప్రదించగా ఆమె వివిధ కారణాల వల్ల ఈ చిత్రంలో నటించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. అదే పాత్రను మంచు లక్ష్మీ కూడా నిరాకరించింది. మొదట్లో ఆ పాత్ర తనకు నచ్చక వదిలేసుకున్నానని చెప్పిన ఆమె తాజాగా ఓ టీవీషోలో ఆ పాత్రను ఎందుకు వదిలేేసిందో వివరించింది. ఈ పాత్ర ప్రభాస్‌కు తల్లి క్యారెక్టర్‌ కావడంతోనే తాను ఈ పాత్రను చేయలేదని, ప్రభాస్‌ పక్కన తల్లిగా నటించాలంటే నేనేందుకు ఒప్పుకుంటాను? ప్రభాస్‌ లాంటి హీరోని చూస్తే ఆయన తల్లిపాత్రను చేయడానికి ఎవరు మాత్రం అంగీకరిస్తారు? ఆ పాత్ర నచ్చినా కూడా ప్రభాస్‌ను చూస్తే ఎవరికైనా కొడుకు ఫీలింగ్‌ వస్తుందా? మరేదో చెప్పలేని ఫీలింగ్‌ వచ్చినా రావచ్చు. అందుకే ఆ పాత్రను వదిలేశానంటూ కామెంట్స్‌ చేసింది. మరోవైపు అలనాటి అందాల నాయిక కాంచన ప్రస్తుతం 'పెళ్లిచూపులు' హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ఓ చిత్రంలో చాలా గ్యాప్‌ తర్వాత నటించడానికి ఒప్పుకుంది. ఇందులో ఎంతో ప్రాధాన్యం ఉన్న హీరో బామ్మ పాత్రను ఆమె పోషిస్తోంది. కాగా ఆమెకు తగ్గ పాత్రను తన బాహుబలి పార్ట్‌2 లో సృష్టించిన రాజమౌళి ఆ పాత్రను చేయమని కాంచనను అడిగారట. ఆమెకు కూడా ఆ పాత్ర ఎంతగానో నచ్చినప్పటికీ ఈ చిత్రం షూటింగ్‌ జోధ్‌పూర్‌లో చేయాల్సి ఉందని తెలియడంతో నో చెప్పిందంటున్నారు. ఈ చలికాలంలో తన ఆరోగ్య రీత్యా జోధ్‌పూర్‌ వంటి చలితీవ్రంగా ఉండే ప్రాంతంలో షూటింగ్‌ కి వెళ్లడం మంచిది కాదనే ఆమె ఆ పాత్రను నిరాకరించినట్లు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs