Advertisement
Google Ads BL

'ఖైదీ..' టీజర్: ఇండస్ట్రీ కి స్వీట్ వార్నింగ్..!


ఎప్పుడెప్పుడు చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' చిత్ర టీజర్ ని విడుదల చేస్తారా.. ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటుడుని చూద్దామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుండి తమ అభిమాన నటుడు 'ఖైదీ.... ' చిత్రంలో ఎలాంటి నటనను ప్రదర్శించబోతున్నాడో అని తెగ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. అందులోను గత తొమ్మిదేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న చిరు చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి ఒక కారణం. 

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్ర టీజర్ ని కొద్ది నిమిషాల ముందే యూట్యూబ్ లో విడుదల చేసింది 'ఖైదీ... 'చిత్ర యూనిట్. ఈ టీజర్ లో చిరంజీవి మాస్ లుక్ తో ఫైటింగ్ సీన్ తో బోణి చేశాడు. క్లాస్ లుక్ తో మాస్ డైలాగ్తో 'ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా... నాకు నచ్చితేనే చూస్తా.... కాదని బలవంతం చేస్తే... కోస్తా' అంటూ.... ఫైట్ సీన్ తో ఇరగదీసిన చిరు చివరిలో 'ఇది నా స్వీట్ వార్నింగ్' అంటూ సినిమా ఇండస్ట్రీ కి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా డైలాగ్ దంచేశాడు. అలా డైలాగ్ చెప్పిన చిరు ఫైట్స్ సీన్స్ లో నడిచే లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. ఇక టీజర్ చివర్లో  చెమట తుడుచుకుంటూ తనకు స్టార్ ఇమేజ్ ఇలా వచ్చింది అనేదానికి ఉదాహరణగా చిరు మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. 

ఇక టీజర్ తో సినిమా పై వున్న అంచనాలను అమాంతంగా 1000  రెట్లు పెంచేసాడు చిరు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150  లో ఎలా ఉంటాడో అని మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుడు సైతం అత్యంత ఆరాటంతో వున్నారు. ఇక ఈ టీజర్ చూశాక చిరు మళ్ళీ పాత చిరుని గుర్తు చేసేలా వున్నాడు. అప్పట్లో వున్న ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గకుండా చిరు కనిపిస్తున్నాడు. ఫైటింగ్ లో దూకుడు, డైలాగ్లో భారీ తనాన్ని వదలకుండా అదే దూకుడు ప్రదర్శించాడు చిరు. ఇదిలా ఉంటే..తన అన్నయ్య పై దేవిశ్రీ ప్రేమ ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ మామూలుగా లేదు. రత్నవేలు ఫోటోగ్రఫీ గొప్పతనం టీజర్ లో అడుగడుగునా కనిపించింది. మాస్ డైరెక్టర్ అని వినాయక్ కి ఎందుకు ఆ పేరు వచ్చిందో..చెప్పడానికి ఈ టీజర్ ఒక్కటి చాలు. ఇక చిరు చెప్పిన 'ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా... నాకు నచ్చితేనే చూస్తా.... కాదని బలవంతం చేస్తే... కోస్తా' డైలాగ్ 'ఇంద్ర' సినిమాలో పీక కోస్తా అనే డైలాగ్ ని తలపిస్తున్నా..చిరు పలికిన విధానం తో ఈ డైలాగ్ కూడా కొత్తగా అనిపిస్తుంది.   ఇక ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని సురేఖ నిర్మాణ సారధ్యంలో రామ్ చరణ్  నిర్మిస్తున్నాడు. ఇక ఈ 'ఖైదీ... ' పాటలను ఈనెల 25న విడుదల చేసి... వచ్చే సంక్రాంతి కి సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

Click Here to see the Khaidi No 150 Teaser

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs