Advertisement
Google Ads BL

ఓపెనింగ్ కి నోచుకోని పవన్ విగ్రహం ఇదే!


పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతో, రాజకీయాలతో బాగా బిజీ అయిపోయాడు. ఆయనకు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఫ్యాన్స్ బాగా ఎక్కువ. ఇక ఇప్పటివరకు పవన్ కేవలం ఒంటరిగానే రాజకీయాల్లో పోరాడుతున్నాడు. తన అభిమానులతో మాత్రమే పవన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అయితే పవన్ కున్న క్రేజ్ గురించి మనం వేరే చెప్పుకోవాల్సిన పనిలేదు. పవన్ ఎప్పుడు ఎలా ఉంటాడో, అసలేం మాట్లాడతాడో అని అయన అభిమానులే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పవన్ ఏం మాట్లాడినా ఒక సంచలనమే. ఇక పవన్ ఓపెన్ గానే 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించాడు. ప్రజల సమస్యల కోసం పోరాడుతూ... వారి కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పవన్ బాగా బిజీగా వున్నాడు. 

Advertisement
CJ Advs

అయితే పవన్ అభిమాని ఒకరు పవన్ మీద వీరాభిమానం తో పవన్ విగ్రహాన్ని తయారు చేయించాడు. అతను పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లి గూడెం కు చెందిన సీతాల చందుమోహన్. సీతాల చందుమోహన్.... శిల్పి అరుణప్రసాద్ చేత పవన్ విగ్రహాన్ని తయారు చేయించాడు. అయితే ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారే గాని.. దాని ముసుగు ఇంతవరకు తియ్యకుండా అలానే ఉంచేశారు. ఇక ఆ ముసుగు వర్షానికి తడిచి, ఎండకు ఎండి చిరిగిపోయి ఇప్పుడు ఆ విగ్రహం బయట అందరికి దర్శనమిస్తుంది. అయితే కొంతమంది ఆ విగ్రహాన్ని ఫోటో తీసి  సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. 

ఈ విగ్రహాన్ని ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఒక కారణంగా చెబుతున్నారు. రాజకీయాల్లో పవన్ అందరిని తన మాటల బాణాలతో పరిగెత్తిస్తున్నాడు. ఇక పవన్ కూడా పొలిటికల్ గా రెడీ కాకపోవడం కూడా  ఒక కారణం గా చెబుతున్నారు. అయితే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చందు మోహన్ మాత్రం పవన్ కళ్యాణ్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs