Advertisement
Google Ads BL

సమంతకి అందుకే అవకాశాలు రావడం లేదా?


సమంత, నాగ చైతన్య ల ప్రేమ వ్యవహారం బయటికి తెలియక ముందు సమంత చేతినిండా సినిమాలతో బాగా బిజీగా ఉండేది. కానీ నాగ చైతన్య తో సమంత లవ్ లో ఉందనే ప్రచారం మొదలయ్యాక ఆమెకి అవకాశాలు రాకో... లేక ఆమెకే సినిమాలు చెయ్యడం ఇష్టం లేకో సమంత ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చెయ్యకుండా ఖాళీగా కూర్చుంది. కానీ కోలీవుడ్ లో మాత్రం రెండు మూడు సినిమాలతో బిజీ అయ్యింది. అయితే టాలీవుడ్ లో ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు, డైరెక్టర్స్ కొంచెం జంకుతున్నారని ఇప్పుడు ప్రచారం మొదలైంది. ఆమె నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి అన్నప్పటినుండి టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారనేది ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్న వార్త. 

Advertisement
CJ Advs

వారు భయపడడానికి కారణం ఏమిటంటే అక్కినేని నాగార్జున అంట. సమంత, నాగ చైతన్యని పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సినిమాల్లో నటిస్తుందని చైతూ చాలాసార్లు మీడియా ముఖంగా అందరికి తెలియజేశాడు. అయినా నాగ చైతన్యతో పెళ్లైయ్యాక నాగార్జున కోడలిగా సమంత అక్కినేని ఇంట అడుపెట్టడం వలన ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ ఇస్తే.... తర్వాత  ఏదన్నా తేడా కొడితే తమకి నాగార్జున నుండి మాట వస్తుంది కాబట్టి దర్శక, నిర్మాతలు ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి జంకుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఆఫీసియల్ గా సమంత అక్కినేని కోడలిగా ప్రచారంలో వుంది కాబట్టి ఆఫర్స్ ఇవ్వడానికి అంతలా ఆలోచించే ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదనేది ఇప్పుడు హాట్ టాపిక్. 

ఇక సమంత కూడా తన భవిష్యత్తు ఎలా వుండబోతుందో తనకి తెలుస్తుందని చెబుతుంది. అంతేకాకుండా తన వెనుక ఏం జరుగుతుందో కూడా తనకి తెలుసనీ... రాబోయే రోజుల్లో తనకి సినిమా అవకాశాలు తగ్గడమే కాకుండా యాడ్స్ కూడా తన చేజారిపోయే అవకాశం ఎక్కువగానే ఉందని చెబుతుంది. అయినా తనకేం పర్వాలేదని తనని చూసుకోవడానికి చైతూ ఉన్నాడనే ధీమా వ్యక్తం చేస్తుంది. తనకి 'ఏమాయచేసావే' టైములో తన పర్స్ లో కేవలం 30 డాలర్లు మాత్రమే ఉన్నాయని... ఆ సమయంలో నాగ చైతన్యే తన విషయాలన్నీ దగ్గరుండి చూసుకున్నాడని... ఇక భవిష్యత్తులో కూడా ఇలాగే తనకి చైతు తోడుంటాడని చెబుతుంది. ఎంతైనా సమంత కి చైతూ మీద అంత నమ్మకం ఉండడం గొప్ప విషయమే కదా..!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs