టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ముదురు బ్రహ్మచారి. దేవిశ్రీ ఇప్పటివరకు సంగీతమే ప్రపంచంగా బ్రతికేసాడు. ఇప్పటిదాకా పెళ్లి ఆలోచన లేకుండా గడుపుతున్న దేవిశ్రీ ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతున్నాడని సమాచారం. అయితే దేవిశ్రీ ఇంతకుముందు ఛార్మి ని పెళ్లాడతాడని అనుకున్నారంతా. ఎందుకంటే ఛార్మి, దేవిశ్రీ ప్రసాద్ ని లవ్ చేసింది. ఇక ఆమె దేవిశ్రీ ని లవ్ చేసినప్పటినుండి అతని ఫ్యామిలీతో కలిసిపోయి వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేది. అంతే కాకుండా దేవిశ్రీ ఎక్కడ మ్యూజిక్ ప్రోగ్రాం చేసిన అక్కడ ఛార్మి ఉండేది. ఇక వీరిద్దరి గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త మీడియాలో ప్రచురితమయ్యేది. అయితే దేవిశ్రీ మాత్రం ఛార్మిని ఈ మధ్యన కొంచెం దూరం పెడుతున్నాడు. తన తండ్రి మరణానంతరం దేవి, ఛార్మి నుండి మరింత దూరమయ్యాడనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. అసలు దేవిశ్రీ, ఛార్మిని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. కానీ ఛార్మి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ చుట్టూనే తిరుగుతుండేది.
అయితే ఆ వ్యవహారం ఎలా వున్నా ఇప్పుడు దేవిశ్రీ పెళ్లి చేసుకుంటున్నాడనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ మధ్యన దేవిశ్రీ తన తండ్రి సంవత్సరీకం కోసం తన సొంత గ్రామానికి వెళ్ళాడట. అక్కడ దేవి చుట్టాలంతా దేవీశ్రీని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారట. బలవంతం చెయ్యడంతో పాటు ఒక అమ్మాయి ఫోటోని కూడా చూపించారట. ఆ అమ్మాయి బాగా చదువుకుని... ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో దేవిశ్రీ తల్లికూడా ఆ అమ్మాయిని ఇష్టపడిందని వార్తలొస్తున్నాయి. ఇక తన తల్లి ఒప్పుకోవడంతో దేవికూడా ఆ అమ్మాయిని ఒకే చేసినట్లు చెబుతున్నారు.
మరి దేవిశ్రీ గనక నిజంగా ఒప్పుకుంటే వచ్చే సంవత్సరం దేవి.. పెళ్లి కంపల్సరీగా ఉంటుందని చెబుతున్నారు. అసలు దేవిశ్రీ పెళ్లి విషయం నిజమేనా? అనేది దేవిశ్రీ స్పందన పై ఆధారపడి వుంది.