Advertisement
Google Ads BL

షారుఖ్ కొత్తగా ట్రై చేసినట్టున్నాడు..!


బాలీవుడ్ లో రాహుల్ దోలఖియా డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ హీరోగా ‘రాయీస్’ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో షారుఖ్ కి జోడిగా మహిరా ఖాన్ నటిస్తుంది. ఈ చిత్రానికి సంబందించి ట్రైలర్ ని విడుదల చేసింది ‘రాయీస్’ చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో షారుఖ్ చాలా స్టైలిష్ గా, చాలా యంగ్ గా, చాలా కొత్తగా కనిపించాడు. మద్యం మాఫియా నేపధ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆ మాఫియా గుట్టు రట్టుచేసే వ్యక్తిగా షారుక్ నటించాడు. మద్యం మాఫియా నిర్మూలనకు పాటుపడుతూ... అదే  సమయంలో మహిరా ఖాన్ తో రొమాన్స్ చేస్తూ షారుక్ ఈ ట్రైలర్ లో కనిపించాడు. నవాజుద్దిన్ సిద్దిఖీ కీలకపాత్రలో రానున్న ఈ చిత్రం లో సన్నీ లియోన్ ఒక ఐటెం సాంగ్ లో కనిపిస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ లో సన్నీ లియోన్ ఆరబోసే అందాలు ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. సన్నీ లియోన్ ఐటెం సాంగ్ చేసిన సీన్స్ కొంచెం కొంచెం చూపిస్తూ దానిపై ఆసక్తిని క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రం 2017  జనవరి 25  న విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs