Advertisement
Google Ads BL

సుమన్‌ ఇంటర్వ్యూపై సర్వత్రా ఆసక్తి..!


ఆరడుగుల అందగాడు, హీరో అంటే ఇలా ఉండాలి అనిపించే రూపం సుమన్‌ది. 80వ దశకంలో ఆయన తెలుగు తెరపై ఓ వెలుగువెలిగాడు. అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచాడు. ఆ సమయంలో ఆయన ఇంటి ముందు దర్శకనిర్మాతలు క్యూ కట్టేవారు. ఆ కాలంలో మెగాస్టార్‌ చిరంజీవి ఓ వెలుగు వెలుగుతున్నాడు. చిరు డ్యాన్స్‌ల్లో స్పెషల్‌ అయితే సుమన్‌ ఫైట్స్‌ విషయంలో స్పెషల్‌. స్వతహాగా కరాటె బ్లాక్‌బెల్ట్‌ కావడం కూడా దీనికి కారణం. ఆ కాలంలో చిరుకు గట్టిపోటీ ఇచ్చింది కేవలం బాలకృష్ణ, సుమన్‌లు మాత్రమే. ఇలా ఎవర్‌గ్రీన్‌గా ఎదుగుతున్న సమయంలో ఆయన నీలి చిత్రాల కేసులో జైలు పాలై అవకాశాలు పోగొట్టుకుని కేవలం సెకండ్‌ గ్రేడ్‌ హీరోగా మాత్రమే నిలిచాడు. తాజాగా ఆయన ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్‌ మీరు జైలు పాలవ్వడానికి చిరంజీవి కూడా కారణమనే వాదన ఇప్పటికీ వినిపిస్తోంది. దీనిపై మీ సమాధానం ఏమిటి? అనే ప్రశ్నవేస్తే, సుమన్‌ మాత్రం చిరంజీవికి ఆ అవసరం లేదు. అనవసరంగా ఈ వివాదంలోకి ఆయన్ను లాగవద్దు. ఇండస్ట్రీలో నా ఎదుగుదలను చూసి సహించలేని పరిశ్రమకు చెందిన 'కొందరు' నన్ను ఇరికించారు అని సమాధానం చెప్పాడు. మరి ఆ 'కొందరు' ఎవరనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయిపోయింది. ఇదే చానెల్‌ ఇంతకు ముందు ఆయన బర్త్‌డే సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో కూడా యాంకర్‌ ఇదే ప్రశ్న అడగటంతో ఆయన ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దేనికైనా లిమిట్స్‌ ఉంటాయి. వాటిని దాటవద్దు.. అంటూ చేయి చూపించి ఆగ్రహం వ్యక్తం చేశాడు. రికార్డిండ్‌ ప్రోగ్రామ్‌ అయిన దాని వీడియో అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసే ఉంటుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs