Advertisement
Google Ads BL

చైతు రికమండేషన్‌తో యంగ్‌హీరోకు ఛాన్స్‌..!


ప్రముఖ తమిళనటి, క్రియేటివ్‌ జీనియస్‌ గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ వద్ద దర్శకత్వ శాఖలో శిష్యురాలిగా పనిచేసిన రాగిణి ఇటీవల నాగచైతన్యకు ఓ స్టోరీ చెప్పిందని సమాచారం. ఈ చిత్రం కథ తనకు నచ్చినప్పటికీ తానున్న బిజీలో ప్రస్తుతం ఆ చిత్రం చేయలేనని ఆమెకు చెప్పిన నాగచైతన్య ఈ కథకు యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ అయితే సరిగ్గా సూట్‌ అవుతాడని చెప్పి, ఆయన్ను ఆమెకు రికమెండ్‌ చేశాడట. ఇప్పటికే మంచి ఊపులో ఉండి,'కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు' వంటి చిత్రాలలో నటిస్తున్న రాజ్‌తరుణ్‌ కూడా ఈ చిత్ర కథకు ఓకే చెప్పి, ఆమెకు దర్శకురాలిగా తొలిఛాన్స్‌ ఇచ్చాడని సమాచారం. చైతూకు ఈ కథ ఎంతలా నచ్చిందంటే ఆయన ఈ చిత్ర కథను తన తండ్రి నాగార్జునకు కూడా వినిపించి, ఆ చిత్రాన్ని తమ సొంతబేనర్‌ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపైనే నిర్మించడానికి ఒప్పించాడని తెలుస్తోంది. తనను హీరోగా 'ఉయ్యాల...జంపాల'చిత్రంలో పరిచయం చేసిన బేనర్‌ కావడం, చైతు రికమండ్‌ చేయడంతో దీనికి రాజ్‌తరుణ్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే అఫిషియల్‌గా అనౌన్స్‌ చేయనున్నారు. కాగా రాగిణికి ఇది దర్శకురాలిగా తొలి చిత్రం కావడంతో ఆమె ఏ విధంగా తాను చెప్పిన కథను ఎలా తెరకెక్కిస్తుందో అనే సందేహంతోనే చైతూ అంతటి సాహసానికి పూనుకోలేదని, రాజ్‌తరుణ్‌ను హీరోగా ఒప్పించి,తమ బేనర్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడని, ఈ చిత్రం కనుక హిట్‌ అయితే వెంటనే చైతూ ఆమెకు మరో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడని అంటున్నారు. ఈ విషయంలో తెలివిగా వ్యవహరించిన చైతూ ముందుచూపును కొందరు మెచ్చుకుంటున్నారు. మరి నాగ్‌ తనయుడంటే ఆమాత్రం తెలివిగా ఆలోచించకపోతే ఎలా? అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs