ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టూడెంట్ గా ఉన్న కాలంలోనే ఎత్తుకు పైఎత్తు రాజకీయాలు చేసిన రాజనీతిజ్ఞుడు. అలాంటి రాజకీయ మేధావి ముందా జగన్ కుప్పిగంతులు అన్నట్టుంది ఏపీ రాజకీయాలు చూడబోతే. విషయం ఏంటంటే... గతంలో జగన్ మాట్లాడుతూ తనతో 20 మంది వరకు తెదేపా నేతలు టచ్ లో ఉన్నారని ఏ క్షణంలోనైనా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టడం ఖాయమని ప్రగల్భాలు పలికాడు. అందుకు చంద్రబాబు చేతలతో చేసి చూపించాడు. మాటలు లేవు అంటూ.. జగన్ పార్టీలోని నాయకులను చాలా మందిని ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీలోకి జంప్ అయ్యేలా చేసుకున్నాడు. అదన్న మాట బాబు రాజనీతిజ్ఞత అంటే. అదే విధంగా మళ్ళీ ఈ మధ్య జగన్ గోదావరి జిల్లాలో పర్యటిస్తూ... తెదేపాపై నిప్పులు చెరిగాడు. తాజాగా జగన్ మరో పాటను ఊపందుకున్నాడు. దేవుడు దయతలిస్తే... మరో ఏడాదిన్నర లోనే ఎన్నికలు రావడం ఖాయమని వ్యాఖ్యానించాడు. ఈ విషయాని తెదేపా వర్గాలు సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
ఇంకా తమకు రెండున్నర సంవత్సరాలు అధికారాన్ని అనుభవించే చాన్స్ ఉంటే ఈ జగన్ అధికారం దాహంతో ఒకటిన్నర సంవత్సరానికే కుదించేస్తుండటం దేనికి సంకేతమో చెప్పాలంటూ తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. అయితే ఈ సారి కూడా తెదేపాగానీ జగన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకొని మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలు పెడితే ఎన్నికల నాటికి జగన్ మొదటికే మోసం వస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.