Advertisement
Google Ads BL

ప్రగ్యా రెచ్చిపోతోంది..!


సుందరాంగులు అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ చేస్తుంటారు. ఈ విషయంలో నిన్నటితరం కథానాయిక విజయశాంతిని గూర్చి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆమెకు 'ప్రతిఘటన, కర్తవ్యం' వంటి చిత్రాల తర్వాత విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చింది. దీంతో ఆమె పలు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలలో నటించి, హీరోలను తలదన్నే స్థాయిలో యాక్షన్‌ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. దీంతో స్టార్స్‌ చిత్రాలలో నటించేటప్పుడు కూడా ఆమె పాత్రను కూడా దర్శకరయితలు ఆమె ఇమేజ్‌కు అనుగుణంగా యాక్షన్‌ సీన్స్‌ను చేయించిన చిత్రాలు చాలానే ఉన్నాయి. దాంతో ఆమెకు లేడీ అమితాబ్‌ అనే బిరుదు వచ్చింది. ఆ తర్వాత అనుష్క కూడా అంతటి పేరును కాకపోయినా ఎంతో కొంత పేరును తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఫిమేల్‌ ఓరియంటెడ్‌ కథలంటే హర్రర్‌ చిత్రాలు మాత్రమే గుర్తుకొస్తున్నాయి. తాజాగా హీరోయిన్‌ ప్రగ్యాజైస్వాల్‌ కూడా ఫైట్లు ఓ రేంజ్‌లో ఉతికి ఆరేసింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'నక్షత్రం' మూవీ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సందీప్‌కిషన్‌, రెజీనాలు జంటగా నటిస్తుండగా, సాయిధరమ్‌తేజ్‌, ప్రగ్యాజైస్వాల్‌లు కీలకపాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ ప్రచారంలో భాగంగా రకరకాల టెక్నిక్స్‌ ఉపయోగిస్తున్న కృష్ణవంశీ... ఇప్పుడు ఫైట్స్‌ కంపోజింగ్‌పై ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో తెగ ఫైట్లు చేస్తూ ప్రగ్యాజైస్వాల్‌ అదరగొడుతోంది. గాల్లో ఎగిరి తన్నేయడాలు, నిలువునా గోడలను ఎక్కేయడాలు, ఇద్దరు ముగ్గురిని ఒకేసారి పడగొట్టేయడాలు.. పరుగెత్తుతూ విలన్ల వెంటపడటం, ఫైట్‌ మాస్టర్‌ శ్రీధర్‌పై తీసిన ఈ మేకింగ్‌ వీడియోలో రకరకాల పైట్స్‌తో అదరగొట్టేసింది ప్రగ్యాజైస్వాల్‌. మరి ఈ చిత్రం ఆమెకు ఎలాంటి ఇమేజ్‌ను తీసుకొస్తుంది... ఆమె చేసిన ఫైట్స్‌ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తాయో వేచిచూడాల్సివుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs