Advertisement
Google Ads BL

తమ్మునిపై ప్రేమ వలకబోసిన అన్న..!


నాగబాబు కి తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద అమాంతంగా ప్రేమ పెరిగిందా? అంటే నాగబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనుమానం కలగక మానదు. ఎప్పుడూ అన్న చిరంజీవిని వెనకేసుకొస్తూ తమ్ముడిని తిట్టే  నాగబాబు తాజాగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అవేమిటంటే మా కళ్యాణ్ చాలా తేడా మనిషని .... అతనేం అనుకుంటే అదే చేస్తాడని... అలాగే రాజకీయాల్లోకి ఎవరూ రమ్మంటే వెళ్లలేదని అన్నాడు. ఇంకా మావాడు అభిమానులు కోరుకున్నారనో లేక అభిమానులు కోరుకోలేదనో రాజకీయాల్లోకి వచ్చే టైపు కాదని.. వాడిని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని అంటూ సంచలనంగా ఒక్కసారిగా తమ్ముడిపై ప్రేమ కురిపించాడు. 

Advertisement
CJ Advs

ఇంకా నాగబాబు పవన్ ని ఉద్దేశించి అభిమానులు పెట్టమంటే కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టలేదు. అలాగే మా అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, సక్సెస్ కాలేదు కాబట్టి నేను పెడదామనే ఆలోచన వాడికి లేదు. కాకపోతే ఉన్నత విలువలు వంటబట్టించుకున్న కళ్యాణ్ ఇలా రాజకీయాలను ఎంచుకుని ప్రజలకు ఏదోవొకటి చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లో అడుగు పెట్టాడని చెప్పుకొచ్చాడు. ఇంకా పవన్ గ్రేట్ అని, వాడికి బోలెడంత కోపం ఉందని అయినా చాలా బాలెన్సుగా ఉంటాడని చెబుతున్నాడు. 

ఇక నాకు వాడికి తేడా కూడా చాలా ఉందని చెప్పిన నాగబాబు ఆ తేడా గురించి కూడా మాట్లాడాడు. నేనేమో ‘కర్మ... వదిలెయ్’ అని వదిలేస్తాను. వాడు అలా వదలడు. ఏదోఒకటి అమీతుమీ తేల్చుకునే రకం... అంటూ పవన్ కల్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు. మరి నాగబాబు ఈ మధ్యకాలంలో పవన్ ని తిట్టడమే చూసాం గాని ఎక్కడా పొగడడం అయితే చూడలేదు. మరి ఉన్నట్టుండి నాగబాబు పవన్ కళ్యాణ్ ని పొగడడం వెనుక కారణం ఏమిటా అని మెగా ఫ్యాన్స్ అందరూ తెగ ఆలోచనలో పడ్డారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs