నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక వందో చిత్రం 'గౌతమీపుత్రశాతకర్ణి'. క్రిష్ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పార్ట్‌కు గుమ్మడికాయ కొట్టేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉంది. ఈ చిత్రం టీజర్‌తో పాటు తాజాగా విడుదలవుతున్న ఈచిత్రంలోని యుద్దవీరునిగా,మహారాజు శాతకర్ణిగా బాలయ్య గెటప్‌కు ఆయన అభిమానుల నుండే కాదు... అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో స్టిల్ కూడా సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తూ, అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శాతకర్ణి తల్లి గౌతమిగా నాటి బాలీవుడ్ డ్రీమ్‌గళ్ హేమమాలిని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక శాతకర్ణి భార్యగా వశిష్టదేవి పాత్రలో శ్రియా నటిస్తోంది. ఈ ఇద్దరు డ్రీమ్‌గర్ల్స్ ఒకే సింహాసనం మీద కూర్చుని, అచ్చం రాజసం ఉట్టిపడే కాస్ట్యూమ్స్‌తో కనిపించే స్టిల్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. మొత్తానికి తన పాత్రలకు తగిన పాత్రధారులను ఎంచుకోవడంలో క్రిష్ సక్సెస్ అయ్యాడని అందరూ ఒప్పుకుంటున్నారు. సినిమాలో మంచి ప్రాధాన్యం ఉన్న ఈ రెండుపాత్రలు కూడా సినిమాలో హైలైట్‌గా నిలిచి వెండితెరకు వన్నె తెస్తాయని భావిస్తున్నారు.