Advertisement

అందుకే లారెన్స్‌ ఈజ్‌ స్పెషల్‌...!


కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, దర్శకునిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్న రాఘవ లారెన్స్‌ సామాజిక సేవా కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా లారెన్స్‌కు మంచి డిమాండ్‌ ఉంది. క్షణం తీరిక లేకుండా ఆయన గడుపుతున్నారు. సాధారణంగా ఇలా ఫామ్‌లో ఉన్నప్పుడే తమకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని, నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని అందరూ భావిస్తారు. సమాజ సేవ చేయాలని ఉన్నా కూడా కెరీర్‌ ఊపు తగ్గిన తర్వాత చేయవచ్చులే... ప్రస్తుతం ఖాళీ లేకుండా బిజీగా ఉన్నప్పుడు వాటికి సమయం కేటాయించడం మంచిది కాదని భావిస్తారు. కానీ రాఘవ లారెన్స్‌ మాత్రం దీనికి భిన్నం. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన ట్రస్ట్‌ను, ఆశ్రమాన్ని నిర్వహిస్తూ, అన్ని విషయాలను తానే దగ్గరుండి చూసుకొంటున్నాడు. ఇప్పటికే గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన లారెన్స్‌ తాజాగా మరో ఐదుగురికి ఆపరేషన్స్‌ చేయించాడట. అంతేకాదు... తాను నడుపుతున్న ఆశ్రమంలోని దివ్యాంగులలో డ్యాన్స్‌ పట్ల మక్కువగలవారిని గుర్తించి, వారికి స్వయంగా తానే డ్యాన్స్‌ నేర్పిస్తున్నాడు. ఆయన గతంలో కూడా 'స్టైల్‌, ముని' వంటి చిత్రాలలో దివ్యాంగులతో డ్యాన్స్‌లు చేయించాడు. తాజాగా ఆయన కన్నడలో సూపర్‌హిట్‌ అయిన 'శివలింగ' చిత్రాన్ని పి.వాసు దర్శకత్వంలోనే తమిళంలో రీమేక్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌లో కూడా ఆయన దివ్యాంగులతో అద్భుతమైన, అందరినీ అబ్బురపరిచే విధంగా డ్యాన్స్‌లు చేయించాడని సమాచారం. ఈ స్టెప్స్‌ను ఆయనే దాదాపు నెలరోజులు వారి చేత ప్రాక్టీస్‌ చేయించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మొత్తానికి ఈ విషయాలలో లారెన్స్‌ను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement