ప్రొఫేసర్ కోదండరామ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యాడు. పెద్ద పెద్ద మాటలతో విరుచుపడ్డాడు. కోదండరామ్ ఎలా ఉండాలో కూడా సూచించాడు. తెరాస ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ళు అయిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ప్రోగ్రెస్ కార్డు చూపించారు. ఇదే సందర్భంలో కోదండరామ్ తమ ప్రత్యర్థులతో వేదికలు పంచుకోవడం సరికాదని ఆగ్రహించారు. నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణం అడ్డుకోవడం సరికాదన్నారు. ఇటీవల కోదండరామ్ తెరాస ప్రభుత్వానికి ముల్లుకర్ర అయ్యాడు. కొన్ని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక సారధి. జెఎసి చైర్మన్ గా అందరినీ ఒక్కతాటిపై నడింపించారు. నాటి ఉద్యమాన్ని వ్యతిరేకించినవారు నేడు అందలం ఎక్కారు. మంత్రులయ్యారు. కార్పోరేషన్, సలహాదారుల పదవులు పొందారు. కానీ కోదండరామ్ మాత్రం అలాగే ఉండిపోయి ప్రజల తరుపున మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, తెదేపా వాళ్ళు విమర్శిస్తే అది రాజకీయం అవుతుంది. అదే కోదండరామ్ విమర్శిస్తే ప్రజలంతా ఆలోచిస్తారు. ఇక్కడే కేటీఆర్ కు చిర్రెత్తుకొచ్చింది. అందుకే ప్రభుత్వ అభివృద్ది పనుల గురించి మాట్లాడాల్సిన సందర్భంలో కోదండపై ఫైర్ అయ్యారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.