Advertisement
Google Ads BL

ఈ అమ్మడు మూడో బాయ్ ఫ్రెండ్ తో బిజీ..!


నయనతార.. ఈమె అంటే తమిళ ప్రేక్షకులే కాదు... స్టార్స్‌ నుండి కొత్త వారి వరకు ఈమె తమకు జోడీగా నటించాలని కోరుకుంటారు. తమ చిత్రంలో ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలని దర్శకులు పట్టుపడతారు. దాంతో నయనతార ఎంత రెమ్యూనరేషన్‌ అడిగినా నిర్మాతలకు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. కాగా నయన ప్రేమ వ్యవహారాలలో కోలీవుడ్‌లో ఆరితేరింది. హీరో శింబుతో ఆ తర్వాత దర్శక, హీరో ప్రభుదేవాతో ఆమె నడిపిన ప్రేమాయణం, అవి సృష్టించిన సంచలనాలతో ఆమె ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే వార్తల్లో నిలుస్తూ ఉంది. తాజాగా ఆమె దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమాయణం నడుపుతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తన పర్సనల్‌ వ్యవహారమని, దీనిపై తాను ఏమీ మాట్లాడనని విఘ్నేశ్‌ శివన్‌ అంటున్నాడు. 'నాన్‌దా రౌడీ' (నేను రౌడీనే) చిత్రం సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. కాగా ఆల్‌రెడీ వీరిద్దరికి మే నెలలోనే వివాహం జరిగిపోయిందని కోలీవుడ్‌ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈమధ్యనే నయనతార చెన్నైలోని ఎగ్మూర్‌ ప్రాంతంలో ఓ ఖరీదైన ప్లాట్‌ను కొన్నదని, అందులోనే ప్రస్తుతం నయన, విఘ్నేశ్‌లు ఉంటున్నారని సమాచారం. అయితే తనకున్న డిమాండ్‌ రీత్యా తన పెళ్లిని ఆమె దాస్తోందని అంటున్నారు. కాగా ఇటీవల స్టార్‌హీరో సూర్యకు నయనతార దర్శకునిగా విఘ్నేష్‌ను రికమండ్‌ చేసి ఆయన నటించే చిత్రానికి దర్శకునిగా చాన్స్‌ ఇప్పించిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా తమిళ చిత్రాలు ఉన్నాయి. వాటిల్లో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ మూవీగా రూపొందుతున్న 'ఆరమ్‌' ఒకటి. ఈ చిత్రంలో నయన కలెక్టర్‌ పాత్రలో కనిపించనుంది. ఒక రోజు జరిగిన సంఘటనతో ఈ చిత్రం మొత్తం నడుస్తుంది. దీంతో న్యాచ్యురాలిటీ కోసం ఆ రోజు ధరించిన చీరలోనే ఆమె ఈ చిత్రం మొత్తం కనిపిస్తుంది. సాధారణంగా వెండితెరపై హీరోయిన్లు సీన్‌కో కాస్ట్యూమ్‌ వేయడానికి ఆసక్తి చూపుతుంటారు. మరి ఈ చిత్రంలో నయన తీసుకున్న నిర్ణయం సరైనదే. ఈ చిత్రం ఆమెకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సివుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs