ఫిల్మ్‌సర్కిల్స్‌తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా దిల్‌రాజును మంచి తెలివైన డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా చెప్పుకుంటూ ఉంటాయి. దాన్ని దిల్‌రాజు మరోసారి రుజువు చేసి తాజాగా ఓ ఫ్లాప్ చిత్రం నుంచి కూడా ప్రాఫిట్ బాగా రాబట్టుకున్నాడని సమాచారం. తమిళంలో స్టార్‌గా దూసుకుపోతున్న యంగ్ హీరో శివకార్తికేయన్. ఈయనకు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన 'రెమో' చిత్రం తమిళ్ లో పెద్ద విజయం సాధించింది. ఇక దీంతో తెలుగు మార్కెట్‌పై కూడా ఈ హీరో కన్నేశాడు.అందుకే 'రెమో' చిత్రాన్ని డబ్బింగ్ చేసి దిల్‌రాజు సాయం కోరాడు. కాగా ఈ చిత్రం తానే రిలీజ్ చేస్తున్నానని, ఇది తన చిత్రమని దిల్‌రాజు చేసే ప్రమోషన్, ఆయనకు ఉన్న గుడ్‌విల్ తమకు ఉపయోగపడతాయని ఈ చిత్ర నిర్మాత,
శివకార్తికేయన్‌కు అత్యంత అప్తుడు, ఆయన డేట్స్ కూడా చూస్తూ, తాననుకున్నప్పుడల్లా ఆ హీరో డేట్స్‌ను ఈజీగా పొందే ఆర్.డి.రాజాతో కలిసి శివ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ ప్రమోషన్ కోసం ఆర్.డి.రాజా శివతో కలిసి రెండుకోట్లు దిల్‌రాజుకు ఇచ్చారు. ఇక తెలుగులో రిలీజ్ అయిన తమ థియేటర్ల రెంట్‌ను కూడా వారే కట్టారు. అంతేగానీ ఈ చిత్రాన్ని దిల్‌రాజు స్వంతంగా రిలీజ్ చేయలేదు. ఈ చిత్రానికి ప్రెస్‌మీట్ పెట్టి కేవలం ఇది తన చిత్రమని ప్రమోషన్ చేసినందుకు, ఆయన పేరును వాడుకున్నందుకు కూడా దిల్‌రాజుకు వారు భారీగా డబ్బు ముట్టజెప్పారని ట్రేడ్‌వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రం తెలుగులో సరిగ్గా ఆడలేదు. దీనివల్ల ఆ చిత్రం తమిళ నిర్మాత ఆర్.డి.రాజా, హీరో శివకార్తికేయన్‌లు నష్టపోయారే గానీ ఈ చిత్రం దిల్‌రాజు మాత్రం మంచి ప్రాఫిట్ వచ్చేలా చేసిందని సమాచారం. ఎంతైనా దిల్‌రాజు సామాన్యుడు కాదంటున్నారు.