Advertisement
Google Ads BL

రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న తారక్..!


నందమూరి తారక రత్న రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తుంది. అంతర్గతంగా తెలిసిన సమాచారాన్ని బట్టి గుంటూరు కేంద్రంగా రాజకీయాలు చేయడానికి తారక్ రత్న ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎటువంటి సినిమాలు లేక, ఖాలీగా ఇంట్లో కూర్చుంటున్న తారక రత్నకు ఉన్నట్టుండి రాజకీయాలవైపు గాలి మళ్ళినట్టుగా తెలుస్తుంది.  స్వర్గీయ ఎన్ టి రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ, బాలకృష్ణలే  ఇప్పటివరకు క్రియాశీలకంగా రాజకీయాలు చేస్తున్నవారుగా కనబడుతున్నారు. అయితే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఒకసారి  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ ప్రచారంలో మాత్రమే పాల్గొని ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయిపోయాడు. అయితే.. చంద్రబాబుతో కలిగిన విభేదాల కారణంగానే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ తెదేపాకు దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా లేకపోలేదు. అయితే స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబంలో నుంచి పూర్తి స్థాయిగా తెదేపాను స్వాధీనం చేసుకొనే వారు లేకపోవడంతో చంద్రబాబే పార్టీలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. కాగా ఈ సమయంలో తారకరత్న తెలుగుదేశం పార్టీ వైపు చూడడం అందరిలో ఆసక్తిని రేపే విషయమే.

Advertisement
CJ Advs

అయితే తారక రత్నకు ఎటువంటి సినిమా అవకాశాలు రాకపోవడంతోనే రాజకీయాలవైపు మొగ్గు చూపుతున్నాడని తెలుస్తుంది. అంతే కాకుండా... రాబోవు అసెంబ్లీ ఎన్నికలలో తెదేపా  తరఫున, అంది గుంటూరు జిల్లానుండి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే నెల రోజుల నుండి ఏకంగా తారక రత్న గుంటూరు జిల్లా రాజకీయాలపై కాన్ సెంట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో తారక రత్నపై, చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తాడనేది చూడాలి. అయితే రాబోవు ఎన్నికల్లో తారక రత్న ఎక్కడో ఒక చోట నుండి సీటు దక్కించుకోవాలంటే..  చంద్రబాబును తప్పకుండా ప్రసన్నం చేసుకోవలసి ఉంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs