Advertisement
Google Ads BL

ఆ నిర్మాత ఆగ్రహంపై జయసుధ క్లారిటీ..!


సహజ నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన జయసుధ ఆర్‌ నారాయణమూర్తి హీరోగా నటిస్తున్న‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర నిర్మాతకు జయసుధకు మధ్య అపార్థాలు చోటుచేసుకున్నాయని ఈ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా షూటింగా మధ్యలో ఆగిపోయింది. దాంతో ఈ ఘటనపై రకరకాల ఊహాగానాలు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చెలరేగుతున్నాయి. ఈ విషయంపై జయసుధ స్పందిస్తూ.. అక్కడ జరిగింది చాలా చిన్న విషయమని, అది అంత పెద్దదేం కాదని త్వరలోనే తిరిగి షూటింగ్ స్టార్ట్ అవుతదని వివరించింది. 

Advertisement
CJ Advs

ఈ సినిమా షూటింగ్ విషయంలో అసలేం జరిగిందంటే... కాస్ట్యూమ్స్ డిపార్ట్‌మెంట్‌ వారు అనుకున్న సమయం ప్రకారం జయసుధకు దుస్తులను  అందించలేకపోవడంతో...జయసుధ కొంత ఆలస్యంగా షూటింగ్‌కు హాజరయ్యింది. అసలేం జరిగిందో తెలుసుకోకుండా నిర్మాత ఎందుకు ఆసల్యమైందంటూ జయసుధపై ఆగ్రహానికి లోనయ్యారని, అంతే కాకుండా జయసుధ వ్యక్తిగత సిబ్బందిపై కూడా కేకలు వేశారని తెలుస్తుంది. దీంతో నిర్మాతకు వివరణ ఇచ్చిన జయసుధ తన ఆలస్యానికి కారణం ఇదంటూ తెలిపి, ఇందులో తన తప్పేం లేదని కూడా వెల్లడించింది. 

కాగా ఈ విషయంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలపై జయసుధ స్పందిస్తూ.... ‘ఆ విషయంలో జరిగింది అంత పెద్ద విషయమేం కాదని, చిన్నపాటి అపార్థం వల్ల ఆ ఘటన చోటుచేసుకుందని, ఆ తర్వాత దర్శకుడు నాకు ఫోన్‌ చేశాడు, ఇక ఎలాంటి ఆసల్యం లేకుండా డిసెంబర్‌ 3 నుంచి షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుంది’ అని చెప్పానని వివరించింది. అయితే సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిన సమాచారాన్ని బట్టి కేవలం ఆర్‌ నారాయణమూర్తి కోసమే జయసుధ ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. కాగా శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మాత‌గా ఉండగా చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌డుగా వ్యవహరిస్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs