తమిళంతో పాటు తెలుగులో కూడా క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న దర్శకుడు గౌతమ్‌మీనన్. ఆయన తాజాగా తీసిన 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం తెలుగులో జస్ట్ ఓకే అనిపించినప్పటికీ అదే చిత్రం తమిళ వెర్షన్ మాత్రం మంచి హిట్‌టాక్‌తో నడుస్తోంది. బ్యాడ్‌బోయ్ శింబు ఇందులో హీరోగా నటించాడు. ఈ చిత్రం ఇప్పటికే తమిళనాడులో 30కోట్లను వసూలు చేసి ఇప్పటికీ బాగా రన్ అవుతూనే ఉంది. ఈ చిత్రం ముందు హీరో శింబుకు పెద్దగా సక్సెస్‌లు లేవు. ఆయన నటించిన 'వాలు, ఇదు నంబు ఆలు' చిత్రాలు జస్ట్ ఓకే అనిపించాయి.
కానీ గౌతమ్‌మీనన్ చిత్రం శింబుకు పెద్ద హిట్‌గా నిలవడంతో ఆయన దర్శకుడు గౌతమ్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు. మరోపక్క తమిళ స్టార్ ధనుష్‌కు కూడా ఈ మధ్య పెద్ద హిట్ లేదు. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధనుష్ నటిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో వాలెంటెన్స్‌డే కానుకగా విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంపై ధనుష్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం తమ అభిమాన హీరోకు కూడా పెద్దహిట్ ఇస్తుందనే ధనుష్ ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. మరోపక్క గౌతమ్ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించేశాడు. చియాన్ విక్రమ్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. స్టోరీ డిమాండ్ రీత్యా ఈ చిత్రం షూటింగ్ మొత్తాన్ని అమెరికాలో జరపనున్నారు. ఈ చిత్రం తనకు తమిళంతో పాటు తెలుగులో కూడా పెద్ద హిట్ ఇస్తుందనే నమ్మకంతో విక్రమ్ ఉన్నాడు. దర్శకహీరోలు ఇద్దరూ వైవిధ్యానికి మారుపేరు కావడంతో ఈ చిత్రంపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. వీటితో పాటు తెలుగు 'పెళ్లిచూపులు'ను 'ప్రేమమ్' ఫేమ్ నవీన్‌పౌల్‌తో రీమేక్ చేసే చిత్రంతోపాటు, వచ్చే ఏడాదే నాగచైతన్యను తమిళంలోకి తెరంగేట్రం చేయిస్తూ, తమిళ, తెలుగులో భాషల్లో రూపొందేలా గౌతమ్ మరో చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న గౌతమ్ సినిమాలపై ఆయన చిత్రాలలో నటించే హీరోలు ఎంతో నమ్మకంతో ఉన్నారు.