Advertisement
Google Ads BL

బాలయ్య వారసుడి రెడీ..!


సినిమాల్లో సెంచరీ పూర్తిచేసిన నందమూరి బాలకృష్ణ తన వారసుడిని వెండితెరకు పరిచయం చేయడానికి సరైన సమయం వచ్చిందని భావిస్తున్నారు. వారసుడు నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ వయస్సు 22 సంవత్సరాలే కావడంతో సరైన సమయం ఆసన్నమైందని బాలయ్య సన్నిహితులు భావిస్తున్నారు. బాలకృష్ణ తన 14వ ఏటనే 'తాతమ్మకల' (1974) పరిచయం అయిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అయితే బాలకృష్ణ పూర్తి స్థాయి సోలో హీరోగా తన 24వ ఏట 'సాహసమే జీవితం' (1984)లో నటించారు. దీంతో మోక్షజ్ఞ విషయంలో తండ్రిగా బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

Advertisement
CJ Advs

మరోవైపు మోక్షజ్ఞ తొలి చిత్రానికి డైరెక్టర్‌ ఎంపిక ఫైనల్‌ అయిందనే మాట వినిపిస్తోంది. తన నూరవ సినిమా 'గౌతమిపుత్ర..'ను సకాలంలో పూర్తి ప్రశంసలు అందుకున్న క్రిష్‌కు ఈ అవకాశం దక్కవచ్చని అంటున్నారు. 'సింహా', 'లెజెండ్‌' వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన బోయపాటి పేరును సైతం బాలయ్య పరిశీలనలోకి తీసుకున్నట్టు సమాచారం.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs