కీర్తి సురేష్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. టాలీవుడ్ లో, కోలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈమె హవానే నడుస్తుంది. పెద్ద హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తూ బడా హీరోయిన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. అయితే కీర్తి సురేష్ ఎక్కడా గ్లామర్ పరంగా హద్దులు కూడా దాటడం లేదు. అయినా కీర్తి ని ఆఫర్లు వెల్లువలా తాకుతున్నాయి. చాలామంది హీరోయిన్స్ మోతాదుకు మించి అందాలను ఆరబోస్తుంటే కీర్తి మాత్రం అలా కాకుండా చాలా లక్షణం గా, పద్దతిగా నటిస్తుంది. అంత పద్దతిగా ఉంటే ఆఫర్స్ రావడం చాలా కష్టం. కానీ కీర్తికి మాత్రం బడా స్టార్స్ తో నటించే అవకాశాలు మాత్రం రోజురోజుకి పెరిగిపోతున్నాయి. టాలీవుడ్ లో ఏకంగా పవన్ కళ్యాణ్ పక్కన, మహేష్ పక్కన, అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది కీర్తి సురేష్. ఇక ఇప్పటికే నాని పక్కన నేను లోకల్ చిత్రం లో నటిస్తుంది. ఇక ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
ఇక తమిళ్ లో అయితే కీర్తి హవా మాములుగా లేదు. అక్కడ టాప్ హీరోలందరికీ కీర్తినే కావాలంట. ఏ సినిమాలో చూసిన కీర్తిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసేస్తున్నారు తమిళ దర్శకులు. తమిళ టాప్ హీరో విజయ్ తో కీర్తి చేస్తున్న భైరవ చిత్రం దాదాపు పూర్తి కావొచ్చింది. ఆ తర్వాత సూర్య బ్రదర్స్ తో కూడా సినిమాలు చేస్తుందని టాక్. సూర్య ఎస్ 3 చిత్రం విడుదల కాగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో సూర్య కి జోడిగా కీర్తి ఎంపైకైందని అంటున్నారు. ఇక సూర్య తమ్ముడు కార్తి పక్కన కూడా కీర్తి ఒక సినిమా లో నటించనుందని టాక్. కీర్తి సురేష్ ఇలా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంటే మిగతా హీరోయిన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం అంటున్నారు సినీ ప్రేమికులు.