ప్రధాని నరేంద్ర మోడి భారత దేశంలో పూర్తిగా నల్లధనాన్ని ప్రక్షాళన చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇలా దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని కంకణం కట్టుకొని ఒకపక్క మోడీ పని మోడీ చేస్తుంటే... ఆయన ఆశలను, విజన్ ను దెబ్బతీసేలా ఆర్బీఐ పని ఆర్బీఐ చేస్తుంది. ఆ విధంగా మోడి ఆశలకు గండి పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆర్బీఐ అధికారులే పరోక్షంగా కమీషన్ కు పాల్పడుతూ.. దందాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అలా నల్ల కుబేరులు వద్దనున్న కొన్ని లక్షల కోట్ల పాతనోట్లను కొత్తనోట్లుగా అధికారులే మారుస్తుండటం విస్మయానికి గురిచేస్తున్న అంశం.
మోడి ఎంతో సదుద్ధేశంతో తీసుకున్న నిర్ణయాన్ని ఆర్బీఐ నీరుకారుస్తున్నట్లుగానే తెలుస్తుంది. అధికారికంగా నిజాయితీగా జరపాల్సిన విధానాన్ని ఆర్బీఐ పక్కదారి పట్టిస్తున్నట్లుగా అర్ధమౌతుంది. సామాన్య ప్రజలు ఏటీఎంల వద్ద క్యూకట్టి మరీ నోటు దొరక్క అల్లాడిపోతూ.. ఏకంగా కొంతమంది అయితే క్యూలోనే మరణిస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రజలు నానా ఇబ్బందులను గురౌతుంటే ఆర్బీఐ, బ్యాంకు అధికారులు మాత్రం విచ్చలవిడిగా నల్లదందాను యధేచ్ఛగా సాగిస్తున్నారు. వారి ఆగడాలకు అడ్డులేకుండా.. అందినకాడికి నిధులను పక్కదారి పట్టిస్తూ మోడి ఆశయాలకు గండికొడుతున్నారు. ఆ రకంగా సామాన్యుల ఉసురు తీసుకుంటున్నారు. మోడి ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోని కోట్లాది ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన ఈ ఆపరేషన్ ఆర్బీఐ నీరుకారుస్తుందనే చెప్పాలి.
కాగా ప్రత్యేకంగా మీడియా చేపట్టిన నిఘా ఆపరేషన్ లో భాగంగా కళ్లు భైర్లు కమ్మే నిజాలు వెలువడుతున్నాయి. ఏకంగా 30 శాతం కమిషన్ తీసుకొని ఉన్న బ్లాక్ మనీని అంతా వైట్ చేసేస్తున్నారు. చిన్న చిన్న షాపులను ఆశ్రయంగా చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా అధికారులే ఈ దందాను నిర్వహించడం ఆశ్చర్యమేస్తుంది. దీన్నిబట్టి చూస్తే.. లక్షల కోట్ల దందాని స్వయంగా ఆర్బీఐ అధికారులే నడిపిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇందులో పోలీసులకు కూడా వాటాలు అందుతున్నాయన్న నిజాన్ని వింటుంటే ఇంకా ఆశ్చర్యమేస్తుంది. మొత్తానికి ఆర్బీఐ అధికారులు, పోలీసులు, మీడియేటర్స్ వీరంతా ఓ సిండికేట్ గా ఏర్పడి దందాలు నిర్వహిస్తుంటే ఇంక మోడి ఆశయాలు ఎలా నెరవేరుతాయంటారు.