సినిమాల్లో అవినీతి అక్రమాలు చేసే విలన్ల భరతం పట్టే పవర్ ఫుల్ పాత్రలు అనేకం చేసిన తమిళ స్టార్ శరత్ కుమార్ రియల్ లైఫ్ లో మాత్రం తానే విలన్ అయ్యాడు. ట్రస్ట్ నిధులు దుర్వినియోగం చేశాడనే అభియోగంపై ఆరోపణలు ఎదుర్కొన్న శరత్ కుమార్ అవి నిరూపణ కావడంతో సస్పెండ్ అయ్యాడు. సినిమా ట్రిక్ జరిగిన ఈ పరిణామాలు తమిళ సినిరంగంలో సంచలనం సృష్టించాడు. నడిగర తిలగం (తమిళ సినీ ఆర్టిస్టుల సంఘం) అధ్యక్షుడిగా ఉన్నపుడు మరో నటుడు రాధారవితో కలిసి నిధులు దుర్వినియోగం చేశారని తేలింది. దీంతో వీరిద్దరిని సంఘం నుండి శాశ్వతంగా తొలగించారు. బహుషా సినీరంగంలో ఇలాంటి అరుదైన చర్య గతంలో జరిగి ఉండకపోవచ్చు. ప్రస్తుత అధ్యక్షుడు నటుడు నాజర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
నటి రాధిక భర్త అయిన శరత్ కుమార్ పై చాలా రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరిపై యువనటుడు విశాల్ తిరుగుబాటు చేసి, ఇటీవలే జరిగిన ఎన్నికల్లో నాజర్ నాయకత్వంలో కొత్త కమిటీ ఎంపికయ్యేలా ప్రచారం చేశారు. దీనికి తమిళ సినీరంగం మొత్తం మద్దతు తెలిపింది.
నడిగర తిలగం సమావేశం ఉద్రిక్తల నడుమ జరిగింది. ఒక రాజకీయ పార్టీ సమావేశం మాదిరిగా నిరసనలు జరిగాయి. సినిమా నటులు ప్రజలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తారు. అలాంటి వారికి అవినీతి మకిలి అంటడం ఆశ్చర్యం కలిగిస్తోంది.