Advertisement
Google Ads BL

చరణ్ తో ఛాన్స్ కోసం ఎంతో కష్టపడుతుంది..!


త్వరలో ప్రారంభం కానున్న సుకుమార్‌, రామ్‌చరణ్‌ చిత్రంలో ఎందరినో హీరోయిన్‌ పాత్రకు పరిశీలించినప్పటికీ ఎవ్వరు సుకుమార్‌, చరణ్‌లను మెప్పించలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ చిత్రంలో బొద్దు, ముద్దుగుమ్మ రాఖిఖన్నాకు హీరోయిన్‌గా అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని చరణ్‌తో పాటు మెగాక్యాంప్‌ కూడా భావిస్తున్నారని కూడా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమై, సందీప్‌కిషన్‌తో 'జోరు', గోపీచంద్‌తో 'జిల్‌', రామ్‌తో 'శివమ్‌' 'హైపర్‌' , రవితేజతో 'బెంగాల్‌టైగర్‌', మెగాహీరో సాయిధరమ్‌తేజ్‌తో 'సుప్రీమ్‌' చిత్రాలు చేసిన రాఖిఖన్నా ప్రస్తుతం 'జిల్‌' తర్వాత గోపీచంద్‌ సరసన 'ఆక్సిజన్‌' చిత్రంలో నటిస్తోంది. ఇలా కేవలం రామ్‌, సందీప్‌కిషన్‌, గోపీచంద్‌, రవితేజలతో నటించిన ఈమెకు స్టార్‌హీరోయిన్‌ కావాలనే కోరికకు తగ్గట్లుగా స్టార్‌ హీరోలతో మాత్రం అవకాశాలు రావడం లేదు. తనతో పాటు అటు ఇటుగా సినీకెరీర్‌ను ప్రారంభించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు ఆ తర్వాత వచ్చిన కీర్తిసురేష్‌ వంటి హీరోయిన్లు మాత్రం స్టార్‌హీరోల సరసన స్దానం సంపాదిస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే తమిళ చిత్రంతోనే హీరోయిన్‌గా పరిచయం అయిన ఈమె ప్రస్తుతం తమిళంలో కూడా రెండు చిత్రాలలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా సాయిధరమ్‌తేజ్‌ సరసన 'సుప్రీమ్‌' వంటి కమర్షియల్‌ హిట్‌ సాధించిన చిత్రంలో నటించిన ఈమె కల త్వరలోనే నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఒక్క మెగాహీరోతో నటిస్తే ఇతర మెగాహీరోలు కూడా వారిపట్ల సానుకూలంగా ఉంటారనేది బహిరంగ విషయమే. దీంతో సాయిధరమ్‌తేజ్‌ వంటి మెగా హీరోతో నటించిన ఈమెను సుకుమార్‌ దర్శకత్వంలో చరణ్‌ చేయబోయే చిత్రంలో హీరోయిన్‌గా తీసుకోవాలనే నిర్ణయం జరిగిపోయిందని సమాచారం. కానీ ఈ చిత్రం ప్రారంభమయ్యేలోపు ఆమె మరింత నాజూకుగా, సన్నబడాలని సుక్కు ఆదేశించడంతో, ఆయన కోరినట్లుగా ఈ చిత్రంలో హీరోయిన్‌ ఛాన్స్‌ను మిస్‌ చేసుకోకూడదని భావిస్తున్న రాశిఖన్నా ప్రస్తుతం సన్నగా, నాజూకుగా తయారయ్యేందుకు ఎక్సర్‌సైజ్‌లు, యోగా వంటివి చేస్తూ తెగ కష్టపడుతోంది. ఆమె తాజాగా పోస్ట్‌ చేసిన ఫొటోలు చూస్తే ఇందులో ఆమె కాస్త సక్సెస్‌ అయినట్లే కనిపిస్తోంది. కాస్త వెయిట్‌ తగ్గి కొలతలు మార్చుకుంటూ కనిపిస్తోంది. మొత్తానికి ఈ అవకాశం రాశిఖన్నాకే వస్తే మాత్రం ఇక ఆమె దశ తిరిగినట్లేనని చెప్పాలి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs