Advertisement
Google Ads BL

ఎవ్వరికీ రాని కష్టం..ధనుష్ కొచ్చింది..!


సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ కి ఎవరికీ రాని కష్టం వచ్చింది. సూపర్ స్టార్ అల్లుడనే కాదు ధనుష్ కూడా తమిళ్ లో పెద్ద స్టార్. అతను స్వశక్తితో పైకి వచ్చినవాడు... కాబట్టే రజిని మెచ్చి తన కూతురికిచ్చి పెళ్లి చేసాడు. అయితే ఇప్పుడు ధనుష్ ఒక సమస్యతో నలిగిపోతున్నాడట. అదేమిటంటే ధనుష్ కి తల్లితండ్రులు మేమే అంటూ కొంతమంది రావడమే అసలు సమస్య. మరి ధనుష్ తండ్రి  డైరెక్టర్ కస్తూరిరాజా కదా అనుకుంటున్నారా...! అవును  డైరెక్టర్ కస్తూరిరాజా..  ధనుష్ తండ్రి అని అందరికి తెలుసు. కానీ ధనుష్ ని కన్నది, పెంచింది మేమే అంటూ మధురైకి చెందిన దంపతులు కొన్ని రోజుల ముందు కోర్టు లో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్టు ధనుష్ ని కోర్టుకి హాజరవ్వాలని ఆర్డర్ జారీ చేసింది.

Advertisement
CJ Advs

అదలా ఉండగా మళ్ళీ ధనుష్ పెళ్లి సమయంలో కూడా ఒక వ్యక్తి ధనుష్ తన కొడుకంటూ హల్ చల్ చేసాడని వార్తలొచ్చాయి. ఇక ధనుష్ తండ్రి  డైరెక్టర్ కస్తూరిరాజా ఆ వ్యక్తి పై కేసు వెయ్యడంతో అప్పట్లో ఆ విషయం సమసిపోయింది. అయితే మధురై దంపతులు మాత్రం ధనుష్ మా కొడుకే అని డి.ఎన్.ఏ టెస్టులకి కూడా సిద్ధపడడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇక వీరు తమ కొడుకు ధనుష్ అసలు పేరు కలైసెల్వన్‌ అని... 10 వ తరగతి చదువుతున్నప్పుడే సినిమాల్లో నటించాలని చెన్నై వెళ్లిపోయాడని చెబుతున్నారు. ఇక అప్పటినుండి తమకి దూరమై పోయాడని అంటున్నారు. 

అంతేకాకుండా ధనుష్ తమ కొడుకే అనటానికి తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతున్నారు. అందుకే ఈ ముసలి వయసులో తమ కన్న కొడుకు దగ్గర ఉండాలని తాము ఆశ పడుతున్నామని వారు చెబుతున్నారు. మరి అసలు ధనుష్ కి నిజంగానే మధురై దంపతులు తల్లితండ్రులా? మరి వీరు తల్లితండ్రులైతే కస్తూరిరాజా ఎవరు? కస్తూరిరాజా నిజంగా ధనుష్ తండ్రి కాడా? అని కోలీవుడ్ మీడియాలో అప్పుడే చర్చమొదలైంది. ఇన్ని జరుగుతున్నా ధనుష్ మాత్రం ఏమి స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs