Advertisement
Google Ads BL

హీరో రాకుండానే టీజర్‌ రిలీజ్‌.!!


ఎట్టకేలకు 'ధృవ' థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్నా హడావుడి లేదేమి? అని సందేహిస్తున్న అభిమానులకు ఇప్పుడు నమ్మకం కుదిరింది. డిసెంబర్‌ 9న విడుదలయ్యే ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ చక్రం తిప్పుతున్నారు. సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడియో వేడుకను నిర్వహించనప్పటికీ, ప్రమోషన్‌లో మాత్రం 'సరైనోడు' సినిమా పంథానే అమలు చేయబోతున్నారు. అందులో భాగంగా డిసెంబర్‌ నాలుగున ప్రీ రిలీజ్‌ హడావుడి చేస్తారట. దీనికి వేదిక ఎక్కడనేది మాత్రం నిర్ణయం కాలేదు. ఆ తర్వాత విదేశాల్లో ప్రీమియర్‌ షో ఉంటుంది. 

Advertisement
CJ Advs

ఇకపోతే ట్రైలర్‌ విడుదల ఫంక్షన్‌లో చరణ్‌ కనిపించలేదు. తన సినిమాకు తానే రాకపోవడం చర్చనీయాంశమైంది. పొరుగూర్లో ఉన్నారని అల్లు గారు సర్ది చెప్పినప్పటికీ చరణ్‌ ముఖం చాటేశాడని కొందరికి అనుమానం కలుగుతోంది. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాత్రం హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాతలు ఇద్దరు, దర్శకుడు వచ్చి 'మ.. మ..' అనిపించారు.

Click Here to see the Dhruva Trailer Launch Photos

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs