Advertisement
Google Ads BL

పాపం కాజల్‌... మళ్లీ ప్లాప్‌..!


కాజల్‌ అగర్వాల్‌ ఏం పాపం చేసిందో గానీ..2016 ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ ఇయర్‌లో ఆమె చేసిన చిత్రాలన్నీ అట్టర్‌ ఫ్లాప్‌ చిత్రాలుగా మిగిలాయి. ఎన్‌టిఆర్‌తో 'జనతా గ్యారేజ్‌' ఐటంసాంగ్‌ మినహా..కాజల్‌కి 2016 చాలా బ్యాడ్‌ ఇయర్‌గా చెప్పుకోవాల్సిందే. ఆమె నటించిన సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, బ్రహ్మోత్సవం తో పాటు బాలీవుడ్‌లో చేసిన దో లఫ్జోంకీ కహనీ కూడా ఆమెకి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. తాజాగా ఆమె జీవాతో చేసిన చిత్రం ఒకటి తమిళంలో విడుదలైంది. కవలై వెండమ్‌ పేరుతో విడుదలైన ఈ చిత్రం తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' అనే టైటిల్‌తో విడుదల కావాల్సి ఉంది. రంగం ఫేమ్ జీవా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం.. ఇంకా సెన్సార్‌ అవ్వకపోవడం వల్ల..టాలీవుడ్‌లో ఈ మూవీ రిలీజ్‌ ఆగిపోయింది. తమిళ్‌లో మాత్రం అనుకున్న డేట్‌కే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. అయితే ఈ చిత్రానికి కూడా చాలా పూర్‌ రివ్యూలు పడటంతో..కాజల్‌కి ఈ ఇయర్‌ అస్సలు కలిసి రాలేదని చెప్పుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

అయితే 'జనతా గ్యారేజ్‌' లో చేసిన ఐటమ్‌తో పాటు, మెగాస్టార్‌ 150వ చిత్రంలో నటించే ఛాన్స్‌ రావడం వంటివి కాజల్‌కి కాస్తంత సంతృప్తినిచ్చే అంశాలు. ఇక ఏలాగూ 2016 అయిపోతుంది కాబట్టి..రాబోయే 2017ని కాజల్‌ 'ఖైదీ..' హిట్‌తో మొదలెట్టాలని, ఈ చిత్రంతో ఆమె దశ తిరగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs