Advertisement
Google Ads BL

పెళ్లికి నిఖిల్‌ పెట్టిన కండీషన్ తెలుసా..?


తాజాగా 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' చిత్రంతో మరోసారి సంచలన విజయం సాధించి, హీరోగా మరో మెట్టు ఎక్కిన యంగ్‌హీరో నిఖిల్‌. కాగా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో ప్రభాస్‌, నితిన్‌ వంటి వారిలో నిఖిల్‌ కూడా ఒకడు. తాజాగా ఆయన మనసు పెళ్లి మీదకు మళ్లిందని తెలుస్తోంది. దానికి తోడు తన కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆయనకు ఈ విషయమై తీవ్ర ఒత్తిడి వస్తోందట. ఇంట్లో వారు ఎప్పటినుంచో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆయన ఇంతకాలం నో చెబుతూ వచ్చాడు. కానీ తాజాగా ఆయన కూడా వివాహం చేసుకొని ఓ ఇంటివాడు కావడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడట. దీంతో ఇంట్లో వాళ్లు అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. కానీ నిఖిల్‌ ఆలోచన మరోలా ఉందని తెలుస్తోంది. ఆయన తన కుటుంబసభ్యులకు ఇండస్ట్రీకి చెందిన కుటుంబానికి సంబంధించిన అమ్మాయి అయితేనే బాగుంటుందని సూచించాడట. సినిమా నటులు మరీ ముఖ్యంగా హీరోలంటే రాత్రింబగళ్లు షూటింగ్‌లో గడుపుతుంటారు. దీనికి తోడు కొన్ని సార్లు చాలా కాలం ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని బయటి అమ్మాయి అయితే జీర్ణించుకోవడం కష్టమని, అందుకే ఇండస్ట్రీకి చెందిన కుటుంబానికి చెందిన అమ్మాయి అయితే తన పరిస్థితిని అర్ధం చేసుకుంటుంది కాబట్టి ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే చూడాలని తన కుటుంబ పెద్దలకు స్పష్టం చేశాడని తెలుస్తోంది. దీంతో ఆయన కుటుంబసభ్యులు కూడా నిఖిల్‌ మాటకు అడ్డు చెప్పకుండా ఆయన చెప్పినట్లు చేయడానికి అంగీకరించారని సమాచారం. 

Advertisement
CJ Advs

అయితే నిఖిల్‌ ఎంతో ముందుచూపుతో, తన సినీ కెరీర్‌ మరింత బలపడేలా ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఆయనకు ఇండస్ట్రీపరంగా పెద్ద దిక్కంటూ ఎవ్వరు లేరు. ఆయన ఎవ్వరి బ్యాగ్రౌండ్‌ లేకుండానే ఇంతకాలం కష్టపడుతూ తన టాలెంట్‌తోనే అవకాశాలు సాధిస్తూ హీరోగా దూసుకెళ్లుతున్నాడు. ఈ సమయంలో ఆయనకు ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న, తన మంచి కోరుకునే పెద్దల సలహాలు చాలా అవసరం. ఇంతకాలం అన్నీతానై కథల, దర్శకుల ఎంపికలో కూడా తానొక్కడే నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇలాంటి సమయంలో తన కెరీర్‌ గ్రాఫ్‌ను మరింతగా పెంచుకోవాలంటే దానికి మరొకరి అనుభవం కూడా ముఖ్యం. అంతేకాదు... అన్నీ అనుకున్నట్లు జరిగి, తనకు ఇండస్ట్రీకి సంబంధించిన సంబంధమే కుదిరి, ఇండస్ట్రీతో మంచి అనుబంధం, పలుకుబడి, ఆర్ధికస్థోమత కలిగిన వారింటికి అల్లుడైతే తనకు ఇక పెద్ద అండదండలు, బ్యాగ్రౌండ్‌ లభిస్తాయని, అది హీరోగా తన భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తుందనే ఆశతో ఉన్నాడట. అందుకే తనకు ఇండస్ట్రీతో సంబంధం ఉన్న అమ్మాయే కావాలని పట్టుబడుతున్నాడని,మొత్తానికి తన వివాహాన్ని కూడా తన కెరీర్‌కు ఉపయోగపడేలా ప్లాన్‌ చేస్తున్నాడని ఆయన స్నేహితులు, సన్నిహితులు కూడా గుసగుసలాడుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రధమార్థంలోనే నిఖిల్‌ పెళ్లికొడుకయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs