Advertisement
Google Ads BL

దర్శకేంద్రుడు ప్రగ్యాని మెరిపించేశాడుగా..!


సాధారణంగా హీరోయిన్లను అందంగా చూపించడంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది ప్రత్యేకశైలి. వాస్తవానికి హీరోయిన్లను ఎక్స్‌పోజింగ్‌ చేయకుండానే సంప్రదాయబద్దంగా చూపిస్తూనే, అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా చూపించడంతో స్వర్గీయ బాపు సిద్దహస్తుడు. ఆయన దర్శకత్వంలో చేయాలని ప్రతిహీరోయిన్‌ కలలుగనేది. ఆయన చిత్రాలలో నటించిన హీరోయిన్లను బాపు బొమ్మగా అభివర్ణించేవారు. అయితే బాపులాగానే హీరోయిన్లను తన శైలిలో కాస్త ఎక్స్‌పోజింగ్‌ చేయిస్తూ, రొమాంటిక్‌గా చూపిస్తూనే తనదంటూ మరో ప్రత్యేక విభిన్న తరహాలో అందంగా చూపించడం రాఘవేంద్రుని మాయాజాలంగా చెబుతుంటారు. ఇక ఆయన తాను తీసిన కొన్ని భక్తిరస చిత్రాలలో కూడా కాస్త కల్పనకు చోటిస్తూ, అలాంటి చిత్రాలలో కూడా రొమాన్స్‌కు ఆయన పెద్దపీట వేస్తూ, భక్తిరస చిత్రాలను కూడా కమర్షియల్‌ హంగులతో చూపిస్తుంటాడు. దీనికి ఆయన ఇటీవలికాలంలో తీసిన 'అన్నమయ్య, శ్రీరామదాసు, పాండురంగడు' వంటి చిత్రాలను ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇక కమర్షియల్‌ ఆర్టిస్ట్‌లైన నాగార్జున, సుమన్‌ వంటి వారిని కూడా అన్నమయ్య, రామదాసు, శిరిడీ సాయిబాబా, వేంకటేశ్వరస్వామి, రాముడు వంటి పాత్రలకు ఎంచుకొని ఆయన వారిని ఆయా పాత్రలకు తగ్గట్లుగా తీర్చిదిద్దిన విధానం అమోఘం. అందుకే ఆయనకు ఇటీవలి కాలంలో తీసిన భక్తిరస చిత్రాలు కూడా కమర్షియల్‌గా మంచి లాభాలనే తీసుకొచ్చి, క్యూరియాసిటీని కలిగించేలా చేస్తున్నాయి. 

Advertisement
CJ Advs

కాగా ప్రస్తుతం రాఘవేంద్రరావు నాగార్జునను శ్రీవేంకటేశ్వరస్వామి ప్రియభక్తుడైన హథీరాంబాబాగా చూపిస్తూ, ఆ మహాభక్తుని జీవిత చరిత్ర ఆధారంగా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. 'అన్నమయ్య'లో సుమన్‌ను వేంకటేశ్వరస్వామిగా చూపించి మెప్పించిన రాఘవేంద్రరావు ఈ చిత్రంలో టీవీ ఆర్టిస్ట్‌ సౌరబ్‌ను ఆ పాత్రలో చూపిస్తున్నాడు. హతీరాంబాబాగా నాగార్జున, వేంకటేశ్వరస్వామి మహాభక్తురాలు కృష్ణమ్మగా అనుష్క తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని ఒక్కొక్కరి గెటప్ లను కాస్త గ్యాప్‌ ఇస్తూ రిలీజ్‌ చేస్తున్నాడు. తాజాగా 'కంచె' ఫేమ్‌ ప్రగ్వాజైస్వాల్‌ పోషిస్తున్న పాత్ర గెటప్‌ విడుదల అయింది. దీనిని ప్రగ్వాజైస్వాలే సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు, రాఘవేంద్రరావు అభిమానులను ఈ లుక్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ప్రగ్యాజైస్వాల్‌ లోహంతో తయారుచేసిన బంగారు వర్ణపు గౌన్‌ బరువు 14కేజీలట. ఈ బరువును మోస్తూ ఆమె ఇందులో ఓ నాట్యం చేయనుంది. ఈ కాస్ట్యూమ్‌ను దర్శకేంద్రుని సలహాలతో ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రుక్మిణి తయారు చేసింది. కాగా ఇందులో ప్రగ్యాది చిన్న పాత్రే అయినప్పటికీ చాలా కీలకమైన పాత్ర అని సమాచారం. ఇటీవలే కృష్ణవంశీ, సందీప్‌కిషన్ ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'నక్షత్రం' చిత్రంలో గెస్ట్‌రోల్‌ షూటింగ్‌ను ముగించుకుని వచ్చిన ఈమె ప్రస్తుతం 'ఓం నమో వేంకటేశాయ' షూటింగ్‌లో పాల్గొంటోంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs