Advertisement
Google Ads BL

టాలీవుడ్ లో ఒకలా..కోలీ, బాలీవుడ్లలో మరోలా!


తెలుగులో స్టార్‌ హీరోల వారసులుగా వారి తనయులనే ఆదరిస్తారు తప్పితే.. వారి వారసురాళ్లను మాత్రం పెద్దగా ఇష్టపడరు. అసలు తమ అభిమాన హీరోల కూతుర్లు హీరోయిన్లు కావడానికి గానీ, వేరే హీరోలతో రొమాన్స్‌ చేయడాన్ని గానీ మన అభిమానులు తట్టుకోలేరు. దీనికి ఉదాహరణగా సూపర్‌స్టార్‌ కృష్ణ తనయురాలు మంజుల, మెగా డాటర్‌ నిహారికలతో పాటు అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోయిన్‌ అయిన సుప్రియ వరకు ఎందరినో చెప్పుకోవచ్చు. కానీ ఈ పరిస్థితి కోలీవుడ్‌లో మారుతోంది. అక్కడ కమల్‌హాసన్‌ కూతుర్లను, అర్జున్‌ కూతురిని, శరత్‌కుమార్‌ కుమార్తె వరలక్ష్మీ వంటి వారు బిజీగానే ఉండి గుర్తింపు పొందుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ బాలీవుడ్‌లో మాత్రం హీరోలు, దర్శకనిర్మాతల కూతుర్ల హవా బాగా కొనసాగుతోంది. సీనియర్‌ స్టార్‌ హీరోహీరోయిన్ల కూతుర్లకు అక్కడ బాగా డిమాండ్‌ ఉంది. ఇప్పటికే అలియాభట్‌తో సహా పలువురు ఆక్కడ సంచలనాలు సృష్టిస్తున్నారు. కాగా దీనిని చూసిన పలువురు స్టార్స్‌ త్వరలో తమ వారసురాళ్లను హీరోయిన్లుగా పరిచయం చేయాలని భావిస్తున్నారు. స్టార్‌హీరోయిన్‌ శ్రీదేవి కూతురు జాహ్నవిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ 'సైరత్‌' రీమేక్‌ను తీయాలని భావిస్తున్నాడు. దీనికి శ్రీదేవి సైతం తన అంగీకారం తెలిపిందని సమాచారం. కాగా ఇప్పటికే హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ చెల్లెలు నటిగా పరిచయం అయింది. తాజాగా ఆయన కూతురు సారా అలీఖాన్‌ను కూడా హీరోయిన్‌గా పరిచయం చేయాలని నిర్ణయించాడు. ఇక అమితాబ్‌బచ్చన్‌ మనవరాలు నవ్యానవేలి కూడా తెరంగేట్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ కూతురు సుహానా కూడా హీరోయిన్‌ కావాలని ఆశపడుతోంది. దీనికి షారుఖ్‌ నుండి కూడా సానుకూలస్పందన వచ్చింది. మరి రాబోయే కాలంలో వీరు ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనాలు సృష్టించి, తమ తండ్రులకు, తల్లులకు, తాతయ్యలకు ఉన్న ఫ్యాన్‌ఫాలోయింగ్‌ను ఎలా నిలబెట్టుకుంటారో వేచిచూడాల్సివుంది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs