Advertisement
Google Ads BL

చిరు, బాలయ్యలను చూసి నేర్చుకోండి..!


నేటితరం స్టార్‌హీరోలు తమ చిత్రాలకు భారీ షెడ్యూల్స్‌తో సినిమాలను పూర్తి చేయడానికి చాలా ఎక్కువ రోజులు తీసుకుంటున్నారు. దీనికి నేటితరం దర్శ,నిర్మాతలకు కూడా బాధ్యత ఉంది. దీనివల్ల బడ్జెట్‌ బాగా పెరిగిపోతోంది. ఇక పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాల పేరుతో నేటితరం దర్శకులు గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, భారీ సెట్టింగ్స్‌తో తమ చిత్రాలను చాలా నిదానంగా చేస్తున్నారు. దీంతో క్వాలిటీ కోసం మన స్టార్స్‌ కూడా వారికి మద్దతు తెలుపుతున్నారు. ఇక చారిత్రక నేపథ్యం తరహా సబ్జెక్ట్స్‌కు, సైన్స్‌ఫిక్షన్స్‌లను కూడా ఏళ్లకు ఏళ్లు తీస్తున్నారు. తెలుగులో దీనికి 'బాహుబలి, రుద్రమదేవి' వంటి చిత్రాలను తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక తమిళ శంకర్‌ కూడా 'రోబో, ఐ , 2.0' వంటి చిత్రాలకు ఎంతగా సమయం కేటాయిస్తున్నది తెలిసిందే. అయితే మలయాళ హీరోలు, స్టార్స్‌తో పాటు కమల్‌హాసన్‌లు వంటి హీరోలు అతి తక్కువ సమయంలో మంచి మంచి చిత్రాలు చేస్తున్నారు. ఇక రజనీకాంత్‌ కూడా ఈ వయసులో 'కబాలి'ని రికార్డ్‌ సమయంలో పూర్తి చేశాడు. తాజాగా టాలీవుడ్‌ సీనియర్‌స్టార్స్‌ అయిన నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్‌ చిరంజీవి కూడా తమ తాజా చిత్రాలతో నేటితరం స్టార్స్‌కు సవాల్‌ విసిరి, తమ కమిట్‌మెంట్‌ను, క్రమశిక్షణను నిరూపించుకొని ఈతరం హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. ఈ వయసులో కూడా చిరంజీవి తన ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150 'ని, బాలకృష్ణ తన వందో చిత్రంగా చేస్తున్న ప్రెస్టీజియస్‌ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లను అనుకున్న సమయానికి పూర్తి చేసి విడుదలకు ఇంకా 50 రోజుల ముందే తమ తమ చిత్రాల షూటింగ్స్‌ను పూర్తి చేశారు. స్టోరీల ఎంపికను బాగా నాన్చి లేటు చేసినప్పటికీ ఒక్కసారి షూటింగ్‌ మొదలై పట్టాలెక్కిన తర్వాత విశ్రాంతినే మరిచి తాతయ్యల వయసులో కూడా అనుకున్నట్లుగా షూటింగ్‌ ముగించడం ద్వారా నిర్మాతలకు ఎంత బడ్జెట్‌ను మిగిలించవచ్చో నిరూపించారు. 

Advertisement
CJ Advs

ఇక చిరంజీవికి తన చిత్రం రీమేక్‌ సబ్జెక్ట్‌ కావడంతో షూటింగ్‌ సమయం బాగా తగ్గింది. అయినా ఆయన దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత మేకప్‌ వేసుకొని పుల్‌లెంగ్త్‌ రోల్‌ చేస్తున్నప్పటికీ ఎక్కడా తడబడకుండా తన లక్ష్మాన్ని పూర్తి చేశాడు. ఈ చిత్రం షూటింగ్‌ కేవలం అన్నపూర్ణ స్టూడియోస్‌లో తీసే ఓ మూడునాలుగు రోజల షూటింగ్‌ మినహా మొత్తం పూర్తయింది. ఇక బాలయ్య అయితే మరీ సాహసమే చేశాడని చెప్పవచ్చు. ఇందుకు ఈ చిత్ర దర్శకనిర్మాత అయిన క్రిష్‌ను కూడా అభినందించాలి. చారిత్రక చిత్రమైనప్పటికీ ఆనాటి కాలానికి తగ్గ లోకేషన్స్‌, సెట్టింగ్స్‌, యుద్దాలు, కాస్టూమ్స్‌.. ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ చారిత్రక చిత్రాన్ని దాదాపు పూర్తి చేశాడు. ఈ చిత్రంలో కూడా విజువల్‌ ఎఫెక్ట్స్‌కు, గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ నిర్మాతల బడ్జెట్‌కు అనుగుణంగా, దర్శకుడు క్రిష్‌కు సహకరిస్తూనే ఈ చిత్రాన్ని బాలయ్య చిత్రం చేశాడు. ఇక ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలను, గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్ ఎంతో స్పీడుగా, అలాగని క్వాలిటీ విషయంలో రాజీపడకుండా క్రిష్‌ పూర్తి చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ముందుగా అనుకున్నట్లే సంక్రాంతి బరిలో దిగనున్నాయి. కొంతమంది అయితే ఈ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యే పరిస్థితి లేదని... అనుకున్న సమయంలో వారు చిత్రాలను పూర్తి చేయలేరని భావించారు. కానీ ఈ హీరోలు సకాలంలో సినిమాలను పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారనే ప్రశంసలు లభిస్తున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs