Advertisement
Google Ads BL

బాహుబలి ఆఫీసులో దొరికింది ఎంత?

bahubali,it raids,bahubali movie video leaked,ss rajamouli,bahubali producers | బాహుబలి ఆఫీసులో దొరికింది ఎంత?

కాలకేయుల కష్టాలు తీరేట్టులేవు. ఇటీవలే ఇన్‌కంటాక్స్‌ దాడుల్లో లెక్కలు చెప్పని భారీ మొత్తం పట్టుబడింది. తాజాగా తొమ్మిది నిమిషాల మేకింగ్‌ వీడియో లీకైంది. దీంతో 'బాహుబలి' యూనిట్‌ ఆందోళన చెందుతోంది. 

Advertisement
CJ Advs

'బాహుబలి' ఆఫీసులో దొరికిన మొత్తంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. 60 కోట్లు అని బయటకొచ్చిన సమాచారం. కానీ దొరికింది అంతకంటే ఎక్కువనే మాట వినిపిస్తోంది. పెద్ద మొత్తంలో దొరికిన డబ్బులో కొంత మొత్తానికి లెక్కలు చూపితే, మరికొంత మాత్రం అదృశ్యమైంది. చివరికి లీకుల ద్వారా 60 కోట్లని తేల్చినట్టు సమాచారం. దీనిపై నిర్మాతలు ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. 

'బాహుబలి' నిర్మాతలకు వ్యాపారాత్మక తెలివితేటలు ఎక్కువ. రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రచార లబ్ది పొంది, వందల కోట్ల వ్యాపారం అవలీలగా చేశారు. కేవలం రాజమౌళి బ్రాండ్‌తో అన్ని భాషల్లో బిజినెస్‌ చేశారని అంటున్నారు. 'పెద్దలను' చూసుకుంటే సరి, 'కింది' వాళ్ళతో పనేమిటీ? అనే ధోరణి వల్లే లీకేజీలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నిత్యం వార్తల్లో ఉండే విధంగా నిర్మాతలే ప్రచారం కోసం కొత్తమార్గాలు వెతుకుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs