దక్షణ భారతీయ సినీ పరిశ్రమలో సంచలనతార అమలా పాల్. ఆమె పలు సినిమాల్లో చేసిన హాట్ సన్నివేశాలు, ప్రదర్శించిన ఘాటురేపే ఫోటోషూట్ లు వీటితో సంచలతారగా మారిపోయింది అమలాపాల్. ఆమె తమిళంలో చేసిన తొలి సినిమాలోనే కొడుకును పెళ్లి చేసుకుని మామతో శృంగారాన్ని జరిపే పాత్రను అద్భుతంగా పోషించింది. ఆ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారి పెద్ద దుమారానికి దారితీసింది. ఆ సమయంలో అమలాపాల్ కు వ్యతిరేకంగా పలు మహిళా సంఘాలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన జరిపాయి. అలాంటి స్థాయి నుండి సినిమాల్లోకి ప్రవేశించి ఎవరూ ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ స్థాయిని సంపాదించుకొని తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది అమలాపాల్. అలా తన కెరీర్ కాస్త గాడిలో ఉన్న సమయంలోనే అంటే తన 23 వ సంవత్సరంలోనే తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ను పెళ్ళాడి ఓ సంచలనం రేపింది. అయితే తీరా రెండేళ్లు కూడా నిండకముందే విజయ్ తో సంబంధాలు తెంచేసుకొని ఇప్పుడు స్వేచ్ఛగా తనకు ఇష్టమొచ్చిన రీతిలో దేశ సంచారం చేస్తూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతుంది అమలా పాల్.
అయితే తాజాగా అమలాపాల్ ఓ ఇంటర్వ్యాలో మాట్లాడుతూ.. తన మాజీ భర్త విజయ్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. విజయ్ నుండి వేరు పడ్డాక విజయ్ విలువ తెలుస్తుంది అన్నట్లు అతడిని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది అమలాపాల్. విజయ్ ను తాను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానని తెలిపిన అమలా పాల్... అతనితో విడిపోవాలని తాను తీసుకున్న నిర్ణయం తన జీవితంలో అత్యంత కఠినమైన, బాధాకరమైన, ఎవరూ ఊహించని పరిణామంగా వివరించింది. ఇంకా అమలాపాల్ మాట్లాడుతూ.. తన జీవితంలో తెలిసీతెలియక జరిగిన ఈ పరిణామాలన్నీ తనకు గుణపాఠాలేనని వ్యాఖ్యానించింది. ఇలా అమలాపాల్ విజయ్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడింది. అయితే తాను సరైన సమయంలోనే పెళ్లి చేసుకున్నానని తెలిపి.. తనను చక్కగా గైడ్ చేసి తన జీవితాన్ని సరైన గాడిలో పెట్టేవారు లేరని వివరించడం విశేషం.