Advertisement
Google Ads BL

స్టార్‌ రేసులోకి దూసుకెళుతున్న హీరోలు!


ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టలక్ష్మి రెండు సార్లు తలుపుతడుతుంది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, అదృష్టలక్ష్మి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న వారే జీవితంలో విజేతలుగా నిలబడతారు అనేది మన పెద్దల మాట. దీనినే ఇంగ్లీషులో టర్నింగ్‌ పాయింట్‌ అంటారు. అలా తమకు వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కెరీర్‌ను చక్కదిద్దుకునే ప్లానింగ్‌ ఉండాలి. అలా తమకు వచ్చిన టర్నింగ్‌ పాయింట్‌ను సద్వినియోగం చేసుకొని కొందరు కుర్రహీరోలు తమకొచ్చే అవకాశాలను జాగ్రత్తగా ఆచితూచి ఎంపిక చేసుకుంటూ స్టార్‌హీరోలుగా మారే దిశగా నడుస్తున్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లు నాని, నితిన్‌, నిఖిల్‌లవి. 'ఈగ' చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషించిన నానికి ఆ తర్వాత వరుసగా నాలుగైదు ఫ్లాప్‌లు వచ్చాయి. కానీ 'ఎవడే సుబ్రహ్మణ్యం'తో ఓ వర్గం ప్రేక్షకులను మెప్పించిన ఆయన 'భలే భలే మగాడివోయ్‌' చిత్రంతో నేచురల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆచితూచి చిత్రాలను అంగీకరిస్తూ వరుస విజయాలను సాధిస్తున్నాడు. ఇక త్వరలో విడుదల కానున్న 'నేను...లోకల్‌'తో పాటు శ్రీనివాస్‌ అవసరాలతో పాటు మరికొంతమంది న్యూటాలెంట్‌ను నమ్మి వైవిధ్యభరితమైన చిత్రాలను ఒప్పుకుంటూ తన మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక నితిన్‌ విషయానికి వస్తే నాలుగేళ్ల కిందట ఆయన కెరీర్‌ అధ:పాతాళంలో ఉంది. వరుసగా 13 ఫ్లాప్‌లొచ్చాయి. అయినా తనకున్న తండ్రి అండతో 'ఇష్క్‌' చిత్రంతో సెకండ్‌ ఇన్నింగ్స్‌కు శుభారంభం పలికాడు. ఆ తర్వాత 'గుండెజారి గల్లంతయ్యిందే', 'హార్ట్‌ఎటాక్‌'వంటి చిత్రాలలో నటించి విజయాన్నే సాధించాడు. ఆ తర్వాత మరలా ఆయన నటించిన 'చిన్నదాన నీకోసం, కొరియర్‌బోయ్‌ కళ్యాణ్‌' చిత్రాలు నిరాశపరిచినప్పటికీ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో వచ్చిన 'అ...ఆ' చిత్రంతో 50కోట్లు కొల్లగొట్టిన చిత్రంలో నటించాడు. ఈ చిత్ర విజయంలో అతని పాత్ర తక్కువే అయినా తన మార్కెట్‌ను పెంచుకుని ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ఇప్పుడు యువ సంచలన దర్శకుడు హనురాఘవపూడి డైరెక్షన్‌లో ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. తాజాగా పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో పాటు తాను కూడా భాగస్వామిగా త్రివిక్రమ్‌ అందించిన మూలకథతో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లోకి తెచ్చాడు.

ఇదేదారిలో నడుస్తున్న మరో యంగ్‌ హీరో నిఖిల్‌. 'హ్యాపీడేస్‌'లో నటించాడు. అయితే ఇది సోలో విజయం కాదు. మధ్యలో 'యువత' వంటి చిత్రాలతో ఆకట్టుకుంటూ వచ్చిన నిఖిల్‌కు 'స్వామి..రా..రా'తో పెద్ద హిట్‌ వచ్చింది. ఆ తర్వాత 'కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య' వంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించాడు. ఆ తర్వాత కోన వెంకట్‌ను నమ్మి చేసిన రొటీన్‌ చిత్రం 'శంకరాభరణం' తీవ్రంగా నిరాశపరచడంతో ఈసారి తనకు అచ్చివచ్చిన మరో ప్రయోగాత్మక చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇలా తమ కెరీర్‌ను చక్కదిద్దుకుంటూ విజయాలు సాధిస్తున్న ఈ ముగ్గురు యంగ్‌హీరోలు తమ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై దృష్టి సారించి, స్టార్స్‌గా ఎదుగుతున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs