ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పలు రకాల చర్యలను చేపడుతుంది. అందులో భాగంగా విజయవాడలో మొదటిసారిగా ప్రైవేట్ ఇంక్యుబేషన్ సెంటర్ (వై స్క్వేర్ బిజినెస్ ఇంక్యుబేటర్)ని యార్టగడ్డ రత్నకుమార్ ప్రారంభించాడు. ఒకరకంగా దీంతో ఏపీలో ఇక ఐటీ స్పీడ్ అందుకున్నట్టే అని చెప్పాలి. ఇకనుండి విదేశాల నుంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఈ ఇంక్యుబేషన్ సెంటర్‌తో ఎప్పుడూ కనెక్టయి ఉంటాయని వెల్లడౌతుంది. దీని ద్వారా ఏపీలో భారీస్థాయిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఆస్కారం కూడా ఏర్పడుతుంది. ఇక విజయవాడతో పాటు పలు చోట్ల అంటే గ్రామాలలోని యువకులకు కూడా బోలెడన్ని జాబ్ ఆఫర్స్ వస్తాయని తెలుస్తుంది. అయితే అప్పట్లో అంటే సమైఖ్యంగా ఉన్నకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇలాంటి తరహాలోనే ఓ ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. దాంతో హైటెక్ సిటీ అభివృద్ధి చెందడం, అనేకంగా ఐటీ కంపెనీలు ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి అప్పటిలాగే ఇప్పుడు కూడా ఏపీలోనూ ఇంక్యుబేషన్ సెంటర్ల ప్రారంభించడంతో ఐటీతో పాటు పలు రకాలుగా పారిశ్రామిక అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పవచ్చు. కాగా ఇక నుండి అమరావతి కేంద్రంగా ఆ ప్రాంతంలోని విడయవాడలో సైబర్ టవర్లు, ఫుడ్ కోర్టులు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ ఆయా పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున వెల్లువెత్తే అవకాశం ఉంది. ఇంకా హైదరాబాద్‌లో ఏరకంగా అయితే సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ సంస్థలు అమీర్ పేటలో వెలశాయో ఇక అలాంటినే పలు రకాల శిక్షణా సంస్థలు విజయవాడలో కూడా వెలవనున్నాయి. మొత్తానికి ఇక బెజవాడ కూడా ఐటీ రంగానికి కీలకంగా మారనుందన్నమాట.