ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు హీరోల చూపు ఒక్క హీరోయిన్ మీదే ఉందట. వారిద్దరూ తమ తమ సినిమాల్లో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. ఆమె తమిళ హీరోయిన్ మేఘ ఆకాష్. మేఘ ఆకాష్ ప్రస్తుతానికి గౌతమ్ మీనన్ సినిమా ‘ఎనాయ్ నోకి పాయుమ్ తోట' లో హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఆమె అందానికి, నటనకి ముగ్దుడైన నితిన్ తాను చెయ్యబోయే నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా మేఘా ని ఎంపిక చేస్తున్నట్లు మొన్నామధ్య వార్తలొచ్చాయి. ఇక నితిన్.. మేఘ ని దాదాపు ఫైనల్ చేసాడంటున్నారు.
ఇక అక్కినేని అఖిల్ కూడా తన రెండో సినిమాలో మేఘ ఆకాష్ నే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకునే ఉద్దేశ్యంలో వున్నాడని అంటున్నారు. విక్రమ్ కుమార్ డైరెక్టన్ లో చేసే అఖిల్ రెండో సినిమాకి మేఘ నే హీరోయిన్ అనుకుంటున్నారట .అయితే నితిన్ సినిమాకన్నా ముందే మేఘ అఖిల్ సినిమాలో నటిస్తుందని అంటున్నారు. ఇక అఖిల్ రెండో సినిమాని అన్నపూర్ణ బ్యానర్ పై నాగార్జున స్వయం గా నిర్మిస్తున్నాడు. ఇక అఖిల్ సినిమానే మేఘ కి టాలివుడ్ లో పరిచయం చేసే సినిమా అవుతుందని చెబుతున్నారు.
మరి మేఘకి ఒక్కసారే టాలీవుడ్ లో అఖిల్, నితిన్ ల సినిమాల్లో నటించే అవకాశం దక్కడం ఆమెకి అదృష్టమనే చెప్పాలి.