Advertisement
Google Ads BL

'బ్రహ్మోత్సవం' బయ్యర్లకి న్యాయం కావాలంట!


మహేష్ బాబు ఎంతో ఇష్టం గా నటించిన సినిమా 'బ్రహ్మోత్సవం'. ఈ సినిమా ఎంతదారుణ పరాజయాన్ని చవిచూసిందో అందరికి తెలిసిన విషయమే. ఇక ఈ సినిమా మహేష్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్. శ్రీమంతుడు సినిమా తర్వాత తెరకెక్కిన ఈ సినిమాని పివిపి సంస్థ నిర్మించింది. ఇక ఈ 'బ్రహ్మోత్సవం' సినిమాకి భారీ లెవల్లో బిజినెస్ జరిగింది. శ్రీమంతుడు హిట్ తో మహేష్ మీద నమ్మకం తో ఈ సినిమా హక్కులను భారీ లెవల్లో కొన్నారు బయ్యర్లు. కానీ ఈ సినిమా.. బయ్యర్లకి పెద్ద షాక్ ఇచ్చింది. భారీ నష్టాలను చవి చూసారు 'బ్రహ్మోత్సవం' బయ్యర్లు. ఈ నష్టం కూడా భారీ లెవల్లో ఉందట. ఆ నష్టం దాదాపు 35  కోట్లవరకు వచ్చిందని అంటున్నారు. ఇక ఇంత నష్టపోయిన బయ్యర్స్ పివీపిని, మహేష్ ని ఆశ్రయించగా వారు బయ్యర్స్ కి కొంత మొత్తం డబ్బు ఇస్తామని చెప్పారట. అయితే ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం కావొస్తున్నా ఇస్తామన్న ఆ మొత్తం డబ్బుని పివిపి గాని, మహేష్ గాని ఇంతవరకు బయ్యర్స్ కి ఇవ్వలేదట. ఇక పివిపి అయితే తాను నిర్మించిన కాష్మోరా  హక్కులనిస్తానని కూడా ఇవ్వకుండా బయ్యర్స్ ని మోసం చేసాడని అంటున్నారు. అంతేకాకుండా పివిపి... మహేష్ - వంశి పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చే సినిమా హక్కులని కూడా అదే బయ్యర్స్ కి ఇస్తానని మాటిచ్చాడట. కానీ ఆ సినిమా అసలు పట్టాలెక్కే ఛాన్స్ కనబడడం లేదు. ఇక ఇవన్నీ విని మోసపోయిన బయ్యర్స్ మాత్రం మాకు న్యాయం చేయాలనీ ఛాంబర్ కు పిర్యాదు చేస్తామని అంటున్నారు. మరి ఈ బయ్యర్స్ చేసే ఫిర్యాదు గురించి మహేష్ గాని, పివిపిగాని ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs