తెలంగాణ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఏకిపారేస్తుంది. అసలు పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడి మాటలు వింటుంటే శాడిస్టు లక్షణాలు కనిపిస్తున్నాయి అంటూ ఆమె బాంబు పేల్చేసింది. ఎంతటి వారినైనా ఆమె మాటలు తూటాలతో బాణాలను వేసేస్తోంది. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తనదైన శైలితో విరుచుకు పడిన విషయం తెలిసిందే. తాజాగా పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో మోడీ మాట తీరును చూస్తుంటే శాడిజం కనిపిస్తోందంటూ సంచలనం రేపే వ్యాఖ్యలు చేసింది. నోట్ల రద్దు వ్యవహారం విషయంలో రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి, ఇప్పుడు నెలల తరబడి సమయం కావాలని చెప్పడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపడుతుంది.
నోట్లు రద్దు చేసి పది రోజులు అయినా.. ఇంతవరకూ సమస్యను పరిష్కరించలేదని, సామాన్యులు తెగ అగచాట్లకు గురౌతున్నారని ఆమె వివరించింది. సామాన్యలు బాగా కష్టాలకు గురౌతున్నారన్న ఆమె, నోట్ల రద్దు సామాన్యులపై సర్జికల్ అటాక్ గా అభివర్ణిచింది.
కాగా భాజపా దాని మిత్రపక్షాలకు మోడీ సర్కారుతో సఖ్యతగా ఉండబట్టి రాష్ట్రంలోని రాజకీయ నాయకులకు పెద్దనోట్ల రద్దు విషయం ముందే తెలుసని ఆమె ఆరోపించింది. దాంతో ఆయా నాయకులు ముందే అంతా సర్దుకున్నారని, ఇకపోతే తాను చరిత్రలో నిలిచిపోవాలన్న దురాశతోనే మోడీ ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడని ఆమె వివరించింది. మోడీ హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంతో ప్రజలు నానా అగచాట్లకు గురౌతున్నారన్నది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ తన వద్దవున్న బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకే ప్రధానితో కేసీఆర్ చర్చలు మొదలుపెట్టాడని ఆమె తెలిపింది.