Advertisement
Google Ads BL

చిన్నవాడు అస్సలు భయపడటం లేదు!


ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా నవంబర్ 18న విడుదలకు సిద్ధమైంది. మోడీ పెద్ద నోట్ల రద్దు కి ఏమాత్రం భయపడకుండా ఈ సినిమాని విడుదల చెయ్యడానికి నిఖిల్ సిద్ధమయ్యాడు. ఇంతకు ముందు నాగ చైతన్య కూడా మోడీ దెబ్బకి భయపడకుండా సాహసం శ్వాసగా సాగిపో సినిమాని విడుదల చేసి దమ్ము చూపించాడు. నాగ చైతన్యలాగే నిఖిల్ కూడా తన సినిమాని ధైర్యంగా విడుదల చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ట్రయిలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మొదటి లుక్ నుండే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా... ఈ ట్రైలర్ తో తన సత్తా చాటిందనే చెప్పాలి. అందుకే ఈ సినిమాని ధైర్యం గా విడుదల చెయ్యడానికి సిద్ధపడ్డారని ఈ ట్రైలర్ చూసిన వాళ్లకి అర్ధమవుతుంది. 

Advertisement
CJ Advs

అసలు ఆత్మలంటేనే నమ్మకం లేని కుర్రాడుని ఒక ఆత్మ వెంటాడడం... ఆత్మ నుండి తప్పించుకునేందుకు మహిషాసుర మర్ధిని గుడికి వెళ్లమని అతనికి ఓ మాంత్రికుడు చెప్పడం.... ఆత్మనుండి తప్పించుకుని ప్రాణాల కోసం పరిగెత్తడం... తాను అందరిలాంటి అమ్మాయిని కానని .. ఆత్మననే అర్థంలో ఓ హీరోయిన్ చెప్పడం వంటి విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమా విడుదలై థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించడమే మిగిలింది. ఇక ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా హేబా పటేల్, నందిత శ్వేత లు నటిస్తున్నారు.

Click Here to see The Trailer 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs