Advertisement
Google Ads BL

అక్కడ ధనుష్ ఫ్యాన్..ఇక్కడ పవన్ ఫ్యాన్..!


నేటి యువతీయువకులకు అంటే నేటి కొత్త జనరేషన్‌కు విక్టరీ వెంకటేష్‌కు గ్యాప్‌ బాగానే ఉంది. నేటి వారికి నిన్నటితరం స్టార్‌ అయిన వెంకీపై పెద్దగా క్రేజ్‌ ఉండదనేది నిజమే. కానీ అటు సోలోహీరోగా, ఇటు మల్టీస్టారర్‌ చిత్రాలలో నటిస్తూ ఆయన అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని తెగ కష్టపడుతున్నాడు. ఇందులో భాగంగానే ఆయన నేటి స్టార్‌ హీరోలైన మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌ వంటి వారితో కలిసి నటిస్తూ వస్తున్నాడు. దీని ద్వారా ఆయా స్టార్స్‌ అభిమానుల్లో కూడా గుర్తింపు తెచ్చుకుని వారి అభిమానాన్ని కూడా చూరగొనడమే కాదు.. తనకున్న పాత ఇమేజ్‌ అంటే ఫ్యామిలీలు, లేడీస్‌ ఫాలోయింగ్‌తో ఆయా చిత్రాల విజయాల్లో కీలకపాత్ర పోషించి మెప్పించాడు. ఇక పవన్‌తో ఆయన చేసిన 'గోపాల గోపాల' చిత్రం అనుకున్నంత పెద్ద బ్లాక్‌బస్టర్‌ కానప్పటికీ మంచి కలెక్షన్లనే సాధించింది. మీడియం బడ్జెట్‌తో చిత్రం చేయడం ఈ చిత్రానికి ప్లస్‌ అయింది. ఈ చిత్రానికి వెంకీ, పవన్‌లు రెమ్యూనరేషన్‌ ముందుగా తీసుకోలేదు. చిత్రాన్ని కేవలం పవన్‌ ఫ్రెండ్ శరత్‌మరార్‌, వెంకీ అన్నయ్య, స్టార్‌ ప్రొడ్యూసర్‌ సురేష్‌బాబులే నిర్మించారు. దాంతో చిత్రానికి వారు లాభాల్లో వాటా మాత్రమే తీసుకున్నారు. ముందుగా చెప్పినట్లు ఈ చిత్రాన్ని డాలీ మీడియం బడ్జెట్‌తో తెరకెక్కించడం, పవన్‌, వెంకీలు తప్ప ఈ చిత్రంలో భారీ ప్యాడింగ్‌, ఫేమస్‌ టెక్నీషియన్స్‌ లేకపోవడంతో నిర్మాతలకు లాభాలు బాగానే వచ్చాయి. దీంతో పవన్‌కు, వెంకీకి భారీగానే లాభాల్లో వాటా వచ్చింది. ఇలా ఒకే ఒక్క చిత్రంతో పవన్‌ అభిమానిగా మారిపోయిన వెంకీ తాజాగా మరోసారి తన తాజా చిత్రం 'గురు'లో పవన్‌ను మరోరకంగా వాడుకుంటున్నాడు. 

Advertisement
CJ Advs

పవన్‌, మహేష్‌బాబులకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దాంతో ఆయా హీరోలు తమ ఆడియో ఫంక్షన్‌కు వచ్చినా, లేక వారి పాటలను రీమేక్‌ చేసినా, వారి పేరును తమ సినిమాలలో వాడుకున్నా తమ చిత్రాలకు మంచి పబ్లిసిటీ వచ్చి, వారి అభిమానులను కూడా తాము ఆకర్షించగలమని నేటితరం దర్శకనిర్మాతలు, ఇతర హీరోలు నమ్ముతున్నారు. ప్రస్తుతం వెంకీ కూడా అదే చేయనుండటం విశేషం. ప్రస్తుతం వెంకటేష్‌.. మాధవన్‌ నటించిన 'సాలా ఖద్దూస్‌' చిత్రం రీమేక్‌ 'గురు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్‌లోనే గాక కోలీవుడ్‌లో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. కాగా ఈ చిత్రం తమిళ వెర్షన్‌లో ఈ చిత్ర హీరోయిన్‌ ధనుష్‌కు పెద్ద అభిమాని. కాగా ప్రస్తుతం తెలుగు వెర్షన్‌లో ఈ చిత్రం దర్శకురాలు సుధా కొంగర హీరోయిన్‌ని పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్‌గా చూపించనుందని సమాచారం. మొత్తానికి 'గురు' చిత్రంలో కూడా బాక్సింగ్‌ కోచ్‌ వెంకటేష్‌కు శిష్యురాలిగా చేస్తున్న రితికాసింగ్‌ పవన్‌ అభిమానిగా ఎలా నటించనుంది? ఈ అంశాన్ని పవన్‌ అభిమానులను ఆకర్షించేలా చేసి, టాలీవుడ్‌కు కొత్తగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఒరిజినల్‌ వెర్షన్‌ దర్శకురాలైన సుధా కొంగర.. పవన్‌ను ఎలా తన చిత్రంలో వాడుకోనుంది? అనే విషయాలు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs