Advertisement
Google Ads BL

జనసేనాధిపతిపై కూడా మోదీ ఎఫెక్ట్‌!


ప్రస్తుతం దేశంలో ఎవరి నోటి వెంటవిన్నా ప్రధాని మోదీ తీసుకున్న రూ.500, రూ.1000ల పాతనోట్ల స్దానంలో ప్రవేశపెట్టిన కొత్త నోట్ల గురించే వినిపిస్తున్నాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ మోదీ నిర్ణయంపైనే మాట్లాడుకుంటున్నారు. పాత నోట్లు చెల్లక, ఎవ్వరు తీసుకోకపోతుండటం, కొత్త రూ.2000లకు ఎవ్వరూ చిల్లర ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో బ్యాంకులు, పనిచేయని ఎటీఎంల వద్ద కూడా ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఈ నిర్ణయం తాత్కాలికంగా సామాన్యులకు ఇబ్బంది కలిగించినా దీర్ఘకాలంలో వారికి దాని ఫలాలు అందుతాయని కొందరు ఆర్దిక వేత్తలు కూడా సెలవిస్తున్నారు. కొత్త నోట్లన్నీ విడుదలై ఏటీఎంలన్నింటిలో వాటిని లోడ్‌ చేస్తే పరిస్ధితి సద్దుమణుగుతుందని అంటున్నారు. ఈ నిర్ణయం తాత్కాలికంగా సామాన్యులకు ఇబ్బందులు కలిగించినా, ఎక్కువ నష్టం, భయం మాత్రం కేవలం నల్లదనం ఉన్నవారికేనని బిజెపి నాయకులు వాదిస్తున్నారు. 

Advertisement
CJ Advs

మొత్తానికి రూ.4000 కోసం కూడా సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా బ్యాంకుల వద్ద క్యూలో నిలబడుతున్నారు. రాహుల్‌గాంధీతో పాటు మోదీ మాజీ భార్య, ఆయన తల్లి.. ఇలా అందరూ కొత్తనోట్ల కోసం ఎదురుచూస్తూ బ్యాంకుల వద్దకు వస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులు మాత్రం తమ రాహుల్‌గాంధీ నిజాయితీపరుడు కాబట్టి కేవలం నాలుగువేల కోసం క్యూలో నిలబడ్డాడని, కానీ కోట్లాదిరూపాయల పాతనోట్లు ఉన్న బడా పారిశ్రామిక వేత్తలు, బిజెపి నాయకులు ఎందుకు నగదును మార్చుకోవడానికి రావడం లేదో తెలపాలని, మోదీ ఈ నిర్ణయం తీసుకునే ముందే ఈ విషయాన్ని తనకు సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు, బిజెపి ముఖ్యనాయకులకు, తనకు ఆప్తులైన సీఎంలకు ఇలా అందరికీ దానిని ముందుగానే లీక్‌ చేశాడని, దాంతో వారు తమ పాతనోట్లను ముందుగానే మార్చుకున్నారని విమర్శిస్తున్నారు. అందుకే ఆయన వారికి మరింత సులువుగా కొత్తనోట్లు దాచుకునేందుకు వీలుగా రూ.2000ల నోట్లను ముద్రించే నిర్ణయం తీసుకున్నాడని, దానికి అనువుగానే ఆయన ముందుగా చిన్ననోట్లు కాకుండా రూ.2000నోట్లను ముద్రించేలా నిర్ణయం తీసుకొని, చిన్న నోట్లను మాత్రం నిదానంగా మార్కెట్‌లోకి వచ్చేలా చేశాడనే విమర్శలను కొందరు లేవనెత్తుతున్నారు. మొత్తానికి ఈ ఎఫెక్ట్‌ రాహుల్‌గాంధీతో పాటు మోదీ మాజీ భార్య, తల్లి కూడా బ్యాంకులకు వెళ్లి నాలుగువేల కోసం క్యూలో నిలుచోవడం తమను తాము నిజాయితీపరులుగా నిరూపించుకునే పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే అని కొందరు సామాజిక వేత్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

తాజాగా పవన్‌కళ్యాణ్‌ కూడా కొత్తనోట్ల కోసం జూబ్లీహిల్స్‌లోని ఓ బ్యాంకుకు వెళ్లి తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకొని వెళ్లాడు. ఆయన బ్యాంకుకు వచ్చాడని తెలియడంతో పెద్ద ఎత్తున ఆయనను చూసేందుకు ప్రజలు ఎగబట్టారు. పవన్‌ మాత్రం ఆ కొత్త నోట్లను తీసుకొని వెంటనే హడావుడిగా వెళ్లిపోయాడు. దీనిని కూడా పబ్లిసిటీ స్టంట్‌గా ఆయన ప్రత్యర్ధులు అంటుంటే ఆయన అభిమానులు మాత్రం ఇది పవన్‌ నిజాయితీకి దర్పణంగా ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి దీనిని మనం ఏ దృష్టితో చూడాలి అనేది మన విజ్ఞతపై ఆధారపడివుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs