Advertisement
Google Ads BL

మహేష్ రిక్వెస్ట్‌ ని మురుగదాస్‌ ఒప్పుకున్నాడు..!


పూర్వకాలంలో నటులు ముఖ్యంగా స్టార్‌ హీరోలైన స్వర్గీయ ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వంటి వారు ఒకే సమయంలో మూడు నాలుగు చిత్రాలను కూడా ఒప్పుకొని ఒకే రోజు రెండు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేసి, అలసటనే దరిచేరనివ్వకుండా కష్టపడేవారు. దాంతో వారు ఏడాదికి ఐదారు సినిమాలను కూడా రిలీజ్‌ చేసేవారు. ఇలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన ప్రత్యేకత కలిగిన స్టార్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ, ఆయనైతే రోజూ సమయానికి తిండి తినే సమయం, కాస్త నిద్రపోయి అలసట తీర్చుకునే సమయం కూడా లేనంతగా ఒకే ఏడాది తాను నటించిన డజనుకు పైగా చిత్రాలు విడుదలయ్యేలా కష్టపడే వారు. కానీ నేటి హీరోలు మాత్రం పరిశ్రమకు హీరోలుగా పరిచయమై దశాబ్దాలు దాటిపోతున్నా 25 చిత్రాల మార్క్‌ను కూడా అందుకోలేకపోతున్నారు. దీనికి హీరోల నిదానమే ప్రదానం అనే పద్దతే కాకుండా సినీ రంగంలో వచ్చిన మార్పులు కూడా కారణమే. ముఖ్యంగా అన్ని విషయాలలోనూ తమ తండ్రి, తాతలను అనుసరించే నేటి వారసులు ఈ విషయంలో మాత్రం వారిని ఫాలో కాలేకపోతున్నారు. కాగా సూపర్‌స్టార్‌ కృష్ణ వారసుడైన మహేష్‌ ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇందులో తెలుగు, తమిళ భాషలు రెండింటిలో మంచి ఫాలోయింగ్‌ ఉన్న ద్విభాషా నటులు నటిస్తున్నారు. దీంతో వారి డేట్స్‌ను అడ్జస్ట్‌ చేయడం మురుగదాస్‌కు తలకు మించిన భారమే అయినప్పటికీ అందరి సహకారంతో, అందరూ తాము ఇచ్చిన డేట్స్‌ను ఎగ్గొట్టకుండా క్రమశిక్షణగా ఈ చిత్రం షూటింగ్‌కు హాజరవుతుండటంతో ఈ చిత్రం షూటింగ్‌ను ఎట్టి పరిస్దితుల్లోనూ డిసెంబర్‌ 16లోపు పూర్తి చేయాలని మురుగదాస్‌ పట్టుదలగా ఉన్నాడు. కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరిగి, ఈనెల 13వ తేదీతో ఇక్కడి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కోసం మహేష్‌ విపరీతంగా, రెస్ట్‌ లేకుండా కష్టపడుతున్నాడు. ఇక ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఈనెల 24 నుంచి అహ్మదాబాద్‌లో జరగనుంది. 

Advertisement
CJ Advs

నిజానికి ఈ చిత్రాన్ని ఎలాంటి బ్రేక్‌లు లేకుండా సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని భావించిన మురుగదాస్‌, మహేష్‌లు అందుకు తగ్గట్లే ప్లాన్‌ చేసుకొని, చిత్రాన్ని తీయాల్సిన లోకేషన్లను కూడా ముందుగానే పరిశీలించి వచ్చారు. కానీ ఈ బిజీ షూటింగ్‌తో మహేష్‌కు కాస్త రెస్ట్‌ తీసుకోవాలని అనిపించి, ఆ విషయాన్ని మురుగదాస్‌తో చెప్పి, షూటింగ్‌కు కాస్త బ్రేక్‌ ఇవ్వమని రిక్వెస్ట్‌ చేశాడని సమాచారం. దీంతో హైదరాబాద్‌ షెడ్యూల్‌ పూర్తయిన వెంటనే గ్యాప్‌ లేకుండా అహ్మదాబాద్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేసిన మురుగదాస్‌.. మహేష్‌పై ఉన్న గౌరవంతో ఈ హైదరాబాద్‌ షెడ్యూల్‌కు, అహ్మదాబాద్‌ షెడ్యూల్‌కు మధ్య పదిరోజులు గ్యాప్‌ ఇచ్చాడు. ఈ గ్యాప్‌లో అంటే ఈ పదిరోజులు మహేష్‌ తన ఫ్యామిలీతో కలిసి రెస్ట్‌ తీసుకుంటున్నాడు. కాగా అహ్మదాబాద్‌ షెడ్యూల్‌లో మహేష్‌, విలన్‌ ఎస్‌.జె.సూర్యల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఎస్‌.జె.సూర్య నటునిగా తమిళంలో బిజీ బిజీగా ఉన్నాడు. అయినా ఆయన కూడా మహేష్‌తో ఉన్న 'నాని' అనుబంధంతో, మురుగదాస్‌ మీద ఉన్న గౌరవంతో ఇతర చిత్రాల దర్శకనిర్మాతలను ఒప్పించి తన డేట్స్‌ను అడ్జెస్ట్‌ చేశాడట. అలాగే ఈ అహ్మదాబాద్‌ షెడ్యూల్‌లో పాల్గొనే ఆర్టిస్టులు చాలా తక్కువ మంది కావడంతో అందరి చేత డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయించడం జరిగిందని సమాచారం. మొత్తానికి మహేష్‌కు రెస్ట్‌ ఇవ్వడం కోసం మురుగదాస్‌, మరీ ముఖ్యంగా ఎస్‌.జె.సూర్యలు చాలా సహకరించారనే చెప్పాలి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs