Advertisement
Google Ads BL

కరణ్‌ బాహుబలి ప్లాన్ తో బాలీవుడ్లో సెగలు!


ఒక స్టార్‌ హీరోతో ఓ చిత్రం తీసే భారీ నిర్మాతలు ఆ చిత్రం క్రేజ్‌ను వాడుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లకు, శాటిలైట్‌ హక్కుల కోసం పోటీ పడే చానెల్స్‌కు పలు నిబంధనలు పెడుతుంటారు. తాము నిర్మిస్తున్న మరో చిన్న చిత్రమో.. లేక పూర్తిగా లోబడ్జెట్‌ చిత్రమో తీసినప్పుడు, అది విడుదలై ఫ్లాపయినా లేక ఆ చిత్రం బిజినెస్‌ పూర్తికాక విడుదల నిలిచిపోయినా కూడా స్టార్‌హీరోతో చేసే చిత్రం హక్కులు కావాలంటే ఆ ఆగిపోయిన చిత్రాన్నో, లేక వారు నిర్మిస్తున్న క్రేజ్‌లేని లో బడ్జెట్‌ చిత్రాన్నో కలిపి తీసుకునే వారికే తమ స్టార్‌ చిత్రం ఇస్తామని డిస్ట్రిబ్యూటర్లకు కండీషన్స్‌ పెడుతుంటారు. ఇక శాటిలైట్‌ హక్కుల కోసం పోటీపడే చానెళ్లకు కూడా ఉమ్మడి ప్యాకేజీ అమలు చేస్తుంటారు. కాగా ఇవి ఇటీవల మాత్రమే వచ్చిన నిబంధనలు కావు. క్రేజీ, భారీ చిత్రాల నిర్మాతలు ఇండస్ట్రీలో ఈ విధానాన్ని ఎప్పుడో అమలు చేసి లాభాలు సంపాదించుకొని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తూనే వచ్చారు. ఇక బాలీవుడ్‌లో కూడా ఈ పోకడలు ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ పద్దతి కాస్త మారింది. దీని బదులుగా తాము వరుసగా తీసే చిత్రాలన్నింటినీ ఒకే డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే విధానం ఇప్పుడు అమలులో ఉంది. 

Advertisement
CJ Advs

కాగా బాలీవుడ్‌లో మరలా కరణ్‌జోహార్‌ వంటి దర్శకనిర్మాతల వల్ల పాత సంస్కృతి విషబీజం మరలా ముదురుతోందనే విమర్శలు వస్తున్నాయి. కరణ్‌జోహార్‌ ఇటీవల టాలీవుడ్‌ మూవీ 'బాహుబలి పార్ట్‌1' చిత్రం బాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు తీసుకున్నాడు. కేవలం బాలీవుడ్‌లో కరణ్‌జోహార్‌కు ఉన్న క్రేజ్‌, ఆయన చిత్రాలపై ఉండే నమ్మకం వంటివి ఈ చిత్రానికి భారీగా థియేటర్లు దొరికి, ఎగ్జిబిటర్లు ఉత్సాహంగా ముందుకు వచ్చేందుకు ఉపయోగపడ్డాయి. ఆయన చేసే ప్రమోషన్‌పై నమ్మకం.. వంటివన్నీ బాలీవుడ్‌లో ఈ చిత్రం భారీ విజయానికి దోహదం చేశాయి. ఓ దక్షిణాది డబ్బింగ్‌ చిత్రం బాలీవుడ్‌లో ఇలా 100కోట్ల మార్క్‌ను మించిపోవడానికి కారణమయ్యాయి. ఇక ఇప్పుడు ఆయనపై ఉన్న నమ్మకంతో 'బాహుబలి పార్ట్‌2' చిత్రం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను ఈ చిత్ర యూనిట్‌ ఏకగ్రీవంగా కరణ్‌జోహార్‌ కి ఇవ్వడానికి అగ్రిమెంట్‌ చేసుకుంటోంది. దీంతో ఈ చిత్రం మొదటి పార్ట్‌ను మించి హిట్‌ అవుతుందనే ప్రచారం బాలీవుడ్‌లో మొదలైంది. కాగా ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులనే కాకుండా కరణ్‌జోహర్‌ వచ్చే ఏడాది జనవరి 26న విడుదల కానున్న షార్‌ఖ్‌ఖాన్‌ 'రాయిస్‌' హక్కులను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రానికి పోటీగా అదే రోజు హృతిక్‌రోషన్‌ నటిస్తున్న 'కాబిలి' చిత్రం కూడా విడుదలకానుంది. వాస్తవానికి ఈ ఇద్దరు స్టార్స్‌ ప్రస్తుతం ఫ్లాప్‌ల్లోనే ఉన్నారు. ఇలా ఒకే రోజున విడుదలయ్యే షారుఖ్‌, హృతిక్‌ చిత్రాల మధ్య థియేటర్ల పోటీ నెలకొని ఉంది. దీన్ని అధిగమించేందుకు కరణ్‌జోహార్‌ మన అల్లుఅరవింద్‌, దిల్‌రాజుల్లాగే 'బాహుబలి పార్ట్‌2'కి ఉన్న క్రేజ్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. 

ముందుగా విడుదల కానున్న 'రాయిస్‌' చిత్రం ప్రదర్శించే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకే వచ్చే వేసవికి విడుదల కానున్న 'బాహుబలి పార్ట్‌2' చిత్రం ప్రదర్శన హక్కులు ఇస్తానని, కాబట్టి 'బాహుబలి పార్ట్‌2' విడుదల చేయాలని భావించే ఔత్సాహిక డిస్ట్రిబ్యూటర్లు షారుఖ్‌ 'రాయిస్‌'ను ప్రదర్శించాల్సిందే అనే కండీషన్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా తనకున్న ఇమేజ్‌తో ఓ దక్షిణాది చిత్రాన్ని, అందునా ఓ తెలుగు చిత్రాన్ని అడ్డుపెట్టి షార్‌ఖ్‌ పరువును కరణ్‌జోహార్‌ తీస్తున్నాడని, కొన్ని చిత్రాలు ఆడకపోయినా తమ స్టార్‌ షారుఖ్‌ ఇమేజ్‌, ఓపెనింగ్స్‌ తగ్గవని, ఇలాంటి చెత్త నిర్ణయాలతో తమ హీరో ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తున్న కరణజోహార్‌ లాంటి దర్శకనిర్మాత బాలీవుడ్‌ పరువు తీస్తున్నారని, షారుఖ్‌ చిత్రానికి ఓ తెలుగు డబ్బింగ్‌ చిత్రం క్రేజ్‌ను అడ్డుపెట్టుకోవడం సరికాదని కొందరు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ పద్దతి పలు విపరీత పరిణామాలు దారితీసేందుకు విషబీజాలను నాటుతోందని విమర్శిస్తున్నారు. ఈ విషయంలో షారుఖ్‌ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు చిత్రాలను చిన్న చూపు చూసి దక్షిణాది అంటే కేవలం కోలీవుడ్‌ అనే భావించే భాషాదురభిమానులు కూడా ఈ కారణంగా కరణ్‌పై నిప్పులు కక్కుతున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs