దర్శకుడుగా కొరటాల ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. జనతా గ్యారేజ్ హిట్ తో హ్యాట్రిక్ కొట్టి ఆయన రేంజే మార్చుకున్నాడు. కొరటాల ప్రస్తుతం సామాన్యంగా ఎవరి వద్దకూ వెళ్ళి కథ చెప్పే రేంజ్ కాదు. వచ్చి చెప్పించుకొనే రేంజి. వచ్చినా నచ్చితేనే, చెప్పాలనిపిస్తేనే చెప్పే రేంజ్. అలాంటి కొరటాలకు ఈ మధ్యపవన్ పై దృష్టిమళ్ళిందంట. పవన్ తో సినిమా చేయాలని భావించిన కొరటాల... అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాజాగా మహేష్ బాబుతో ఓ సినిమా తెరకెక్కించనున్నాడు కొరటాల. వీరిద్దరి కాంబినేషన్ లోని ఈ చిత్రం డిసెంబరులోగానీ, జనవరిలో గానీ సెట్స్ పైకి వెళ్ళనుంది. వీరి తర్వాత కొరటాల ఏ హీరోతో చేయాలన్న విషయంలో ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చేసినట్లుగా తెలుస్తుంది.
కానీ కొరటాల మహేష్ తర్వాత సినిమా అంటే 5వ సినిమా రామ్‌చరణ్‌తో చేస్తాడని గట్టిగానే ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ కూడా కొరటాలతో సినిమా చేయడానికి అమితంగా ఉత్సాహం చూపుతున్నాడని కూడా తెలుస్తుంది. అయితే కొరటాల దృష్టి మాత్రం పవన్ కల్యాణ్‌పై ఉందని విశ్వసనీయ వర్గాల సమచారాన్ని బట్టి తెలుస్తుంది. మహేష్‌తో సినిమా పూర్తి చేసేలోగానే పవన్ కళ్యాణ్ కి ఓ కథ చెప్పేసి ఓకే చేయించుకోవాలని కొరటాల భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించి కొరటాల, పవన్ కు కొన్ని సంకేతాలను కూడా పంపినట్లు తెలుస్తుంది. పవన్ తో సినిమా చేయడానికి తాను సిద్దంగా ఉన్నానన్న సంకేతాలను కొరటాల పంపించినట్లు కూడా ఇండస్ట్రీ టాక్. పవన్ కి తగిన కథ తన వద్ద ఉందంటూ పవన్ సన్నిహితులతో చెప్పాడని, ఆ విషయాన్ని వారు పవన్ కి చేరవేశారని కూడా తెలుస్తుంది. అయితే ఇంకేముంది.. కొరటాల ఇంక పవన్ పిలుపు కోసం నిరీక్షిస్తున్నాడన్న మాట.
అయితే పవన్ రాజకీయాల్లో కీలకంగా సభలకు సమావేశాలకు తిరుగుతూ అటు కాటమరాయుడు షూటింగ్ లో కూడా బిజీగా పాల్గొంటూ ఉంటున్న విషయం తెలిసిందే. పవన్ తర్వాత సినిమా త్రివిక్రమ్ తో మొదలౌతుంది. ఈ మధ్యలో పవన్ కొరటాలను పిలిపించుకొని కథ విని ఓకే చేయకపోతాడా? అన్నట్లు కొరటాల భావిస్తున్నట్లు కూడా సీని పరిశ్రమ టాక్. ఇకపోతే రాబోవు ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలన్న దిశగా పవన్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
CJ Advs