ఆ ఫోటోలో పెళ్లి కుమార్తె ని చూడండి భర్తని పక్కకి పెట్టేసి హీరో మహేష్ బాబుతో సెల్ఫీ తీసుకుంటుంది. ఈ విచిత్రమైన ఫోటో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూతురి రిసెప్షన్ లో తీసింది. నిన్న రాత్రి హైద్రాబాద్లో జరిగిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూతురు స్వాతి రిసెప్షన్ కి టాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామందే హాజరయ్యారు. బడా హీరోలు హాజరై ఈ పెళ్లి రిసెప్షన్ కి నిండుదనం తెచ్చారు. వీరంతా తలసాని ఆహ్వానం పై ఈ వేడుకకి హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో హైలెట్ గా చెప్పుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తలసాని కూతురు స్వాతిని అల్లుడు రవిని ఆశీర్వదించడానికి డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి హాజరయ్యారు. ఇంకా బాలకృష్ణ కూడా ఈ వేడుకకి హాజరై వధూవరులని ఆశీర్వదించారు. అలాగే మెగా హీరో అల్లు అర్జున్, అక్కినేని హీరో అఖిల్, మంచు విష్ణు, మంచు మనోజ్, హీరో గోపీచంద్, నటి హేమ,రాజేంద్ర ప్రసాద్, దాసరి, బోయపాటి,ఆలీ, కృష్ణం రాజు, బ్రహ్మానందం మొదలగువారు తలసాని కూతురు స్వాతి రిసెప్షన్ కి హాజరయిన వారిలో వున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ వేడుకకి హాజరై అందరిని ఆశ్చర్య పరిచారు. మహేష్.. తలసాని ఆహ్వానంపై ఈ వేడుకకి వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు తెలుపగా... తలసాని కుమార్తె స్వాతి మాత్రం మహేష్ తో సెల్ఫీ కోసం ప్రయత్నించింది. మహేష్ తో సెల్ఫి తీసుకుంటూ ఆమె భర్త రవిని మాత్రం దూరం పెట్టేసింది. ఇది చూసి అక్కడున్నవారంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. మరి మహేష్ కి లేడీస్ ఫాలోయింగ్ మాములుగా ఉండదని టాక్. ఇక ఈ పెళ్లికూతురు సెల్ఫీతో అది మరోసారి రుజువైంది.