నందమూరి బాలకృష్ణ 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నాడన్న విషయంపై ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బాలకృష్ణ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కబోయే రైతు చిత్రం అర్థాంతరంగా ఆగిపోయే ప్రమాదం లేకపోలేదని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ విషయం తెలుస్తుంది. అసలు బాలకృష్ణ 100వ చిత్రంగా రైతు తీద్దామనుకొన్నారు. కానీ.. అనుకోకుండా గౌతమి పుత్ర శాతకర్ణి పట్టాలెక్కించేశారు. అయితే రైతు కథపై ప్రేమ మాత్రం తగ్గలేదు బాలయ్యకి. అయినా ఈ చిత్రాన్ని కచ్ఛితంగా తాను హీరోగా తీయాలన్న తలంపు మీద కృష్ణవంశీతో ఫిక్స్ అయ్యాడు. అంతేకాకుండా ఇందులో ఓ పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని కూడా కలిసి మాట్లాడి వచ్చాడు. అందుకు అమితాబ్ కూడా తన సమ్మతిని తెలిపాడు.
కానీ ప్రస్తుతం ఏమైందో ఏమోగానీ, ఈ చిత్రాన్ని అర్థాంతరంగా ఆపేద్దామని బాలయ్య భావిస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఆ కథ కృష్ణవంశీ చేతుల్లో పడ్డాక రకరకాల మెలికలు తిరుగుతుందని, ఆ మలుపులతో బాలకృష్ణకు చిర్రెత్తి కొస్తుందని టాక్ నడుస్తుంది. సరిగ్గా కృష్ణవంశీ చేతిలో ఆ స్టోరీ పడ్డాక రోజు రోజుకీ కొత్త కొత్తగా వివిధ రూపాలు తిప్పుతున్నాడని అందుకనే బాలకృష్ణకు, కృష్ణవంశీకి మధ్య కాస్త గ్యాప్ ఏర్పడిందన్నది పరిశ్రమలో టాక్ నడుస్తుంది. అందుకనే బాలకృష్ణ నిశ్శబ్దంగా రైతు సినిమాని అలా కాస్త పక్కన పెట్టాడని కూడా తెలుస్తుంది. ఇంకా తన 101వ సినిమాకి సంబంధించిన మరో కథ, దర్శకుడు కోసం బాలయ్య అప్పుడే హింట్స్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ రైతు కథ కృష్ణవంశీది కాదని, అందుకనే ఇప్పుడు కృష్ణవంశీకి మరో దెబ్బ పడిందని కూడా తెలుస్తుంది. చూద్దాం మళ్ళీ మూడ్ మారి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ జరుగుతుందేమో... అప్పటివరకు మాత్రం కృష్ణవంశీకి కాస్త నిరాశేగా.